Covid Positive : ముంబైలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు..ఒకే స్కూల్ లోని 26మంది విద్యార్థులకు పాజిటివ్

కొద్ది నెలల క్రితం కరోనా హాట్ స్పాట్ గా ఉన్న ముంబైలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

Covid Positive : ముంబైలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు..ఒకే స్కూల్ లోని 26మంది విద్యార్థులకు పాజిటివ్

Mumbai

Updated On : August 26, 2021 / 8:15 PM IST

Covid Positive కొద్ది నెలల క్రితం కరోనా హాట్ స్పాట్ గా ఉన్న ముంబైలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబై సిటీలో 397 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. అయితే గత మూడు వారాలుగా ముంబైలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

అయితే కోవిడ్ మూడో దశలో చిన్నపిల్లలకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముంబైలోని అగ్రిపడా ఏరియాలోని సెయింట్ జోసెఫ్ బోర్డింగ్ స్కూల్ లోని 26మంది విద్యార్ధులకు గురువారం కరోనా పాజిటివ్ రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోవిడ్ సోకిన 26మందిలో..నలుగురు 12ఏళ్ల లోపు వయస్సు వారని,వీరిని నాయర్ హాస్పిటల్ కి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మిగిలిన 22మంది విద్యార్ధులు 12ఏళ్లు పైబడినవారని..వీరిని రిచర్డ్ సన్ క్వారంటైన్ సెంటర్ కి తరలించినట్లు సమాచారం.