Covid : ఇంట్లోనే కరోనా టెస్టు

కరోనా వచ్చిందా లేదా ? తెలుసుకోవాలని ప్రజలు పరుగులు పెడుతున్నారు. చాంతాండత క్యూలో గంటల తరబడి నిల్చొని...టెస్టులు చేయించుకుంటున్నారు. ఇక ఆ అవసరం లేదు. ఎందుకంటే..ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవచ్చు.

Covid : ఇంట్లోనే కరోనా టెస్టు

Covid Test

Updated On : May 20, 2021 / 10:39 AM IST

Home Test Kit : కరోనా వచ్చిందా లేదా ? తెలుసుకోవాలని ప్రజలు పరుగులు పెడుతున్నారు. చాంతాండత క్యూలో గంటల తరబడి నిల్చొని…టెస్టులు చేయించుకుంటున్నారు. ఇక ఆ అవసరం లేదు. ఎందుకంటే..ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవచ్చు. కొత్త ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ (ర్యాట్‌) కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతి ఇచ్చింది.

హోం టెస్టింగ్‌ మొబైల్‌ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్, ఆపిల్‌ స్టోర్లలో అందుబాటులో ఉందని, దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు, ల్యాబ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినవారితో సన్నిహితంగా మెలిగివారు మాత్రమే దీన్ని ఉపయోగించి కరోనా నిర్ధారణ చేసుకోవాలని సూచించింది. పుణేలో మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ కిట్ ను రూపొందించింది. ఈ కిట్ ను ఐసీఎంఆర్‌ పరిశీలించి..ఆమోదం తెలిపింది.

ముక్కులో నుంచి తీసిన స్వాబ్‌తో పరీక్ష ఉంటుందని, యూజర్‌ మాన్యూవల్‌లో సూచించిన ప్రకారం పరీక్ష చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షలో పాజిటివ్‌గా తేలితే.. వ్యాధి నిర్ధారణ అయినట్లుగానే పరిగణించాలని వెల్లడించింది. లక్షణాలు ఉన్నా..నెగిటివ్‌గా వస్తే మాత్రం… ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. ఆర్‌టీపీసీఆర్‌ ఫలితం వచ్చేదాకా ఆరోగ్యశాఖ ఇచ్చిన హోం ఐసోలేషన్‌ ప్రొటోకాల్‌ను పాటించాలని స్పష్టం చేసింది.

Read More : Komaram Bheem NTR : గోండు బెబ్బులి గాండ్రింపు.. ‘ఆర్ఆర్ఆర్’ నుండి యంగ్ టైగర్ న్యూ పోస్టర్..