COVID patients: హాస్పిటల్ బయటే స్ట్రెచర్‌పై ప్రాణాలు కోల్పోతున్న కొవిడ్ పేషెంట్లు
డాక్టర్లకు చూపించగానే కొద్ది నిమిషాల ముందే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ...

Covid Patients Die On Trolleys Outside Delhi Hospital
COVID patients: సోదరుడిని మోసుకెళ్లలేక శ్యామ్ నారాయణ్ అనే వ్యక్తిని ఆటో రిక్షా పిలిపించి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లి డాక్టర్లకు చూపించగానే కొద్ది నిమిషాల ముందే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ లో ప్రాణాలు కోల్పోయిన వారిలో నారాయణ్ ఒకరు. అతని సోదరులు ముందుగా శుక్రవారం ఉదయం 6గంటలకే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పుడేమో ఇంటికి తీసుకెళ్లొచ్చని డాక్టర్లు సూచించారు.
పది గంటల తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. ఆ సమయంలో హాస్పిటల్ కు తీసుకొచ్చేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ‘ఆ ఆవేదనలో అతని తమ్ముడు రాజ్.. వ్యవస్థ నాశనమైంది’ అంటూ అరిచాడు.
ఐదుగురు పిల్లల తండ్రి అయిన నారాయణ్ హాస్పిటల్ లో అడ్మిట్ అవకుండానే ప్రాణాలు కోల్పోయాడు. అతని చావు మాత్రం అనుకోకుండానే అధికారిక లెక్కల్లో చేరిపోయింది. దేశమొత్తం కరోనా ఇన్ఫెక్షన్ రేటు వరుసగా 3లక్షలకుపైగానే నమోదైంది. 2వేల 263మంది చనిపోగా అందులో ఢిల్లీ నుంచే 300మంది ఉన్నారు.
ఢిల్లీలో అమాంతం పెరిగిపోయిన కొవిడ్-19 కేసుల దృష్ట్యా.. హాస్పిటల్స్ కు మితిమీరిన భారం అయింది. జీటీబీ హాస్పిటల్ లో పేషెంట్లు అంబులెన్స్ లలో వస్తున్నారే కానీ, బెడ్స్ మాత్రం అందుబాటులో ఉండటం లేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వం పేషెంట్లను ఆదుకునేందుకు శాయశక్తులా శ్రమిస్తూనే ఉంది.
ప్రభుత్వ హాస్పిటల్స్ కు చెందిన 400 కొవిడ్ ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ అన్నీ నిండిపోయే ఉన్నాయి. ప్రతి ఐదు నిమిషాలకోసారి అంబులెన్స్ లలో, ఆటోలలో తీసుకొచ్చే పేషెంట్లకు చోటు లేకుండాపోతుంది. ఓ అరడజను వరకూ ట్రాలీలలో వెయిట్ చేసి అడ్మిట్ అవకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఓ వ్యక్తిని ఐసీయూలో చేర్చుకోవడానికి నిరాకరించడంతో మళ్లీ ఆటోలోనే కూర్చొండిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత స్పృహ కోల్పోవడంతో స్ట్రెచర్ పై పడుకోబెట్టారు. అతను చేతులతో ఐసీయూ డోర్ చూపిస్తూనే అక్కడే పడిపోయాడు.
మరో వ్యక్తి అంబులెన్స్ లోనే ఒంటరిగా ఉండి అంబులెన్స్ డోర్లను పట్టుకుని ఉండిపోయాడు. మరో వ్యక్తికి ఆక్సిజన్ సిలిండర్ అయిపోవడంతో మార్చుదామని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం ఉన్న 4వేల 500 బెడ్లకు గానూ కేవలం 22 ఐసీయూ బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.