ఇలాగైతే ఆఫీసుల్లో పనిచేసేదెట్టా? సెలవు ఇవ్వలేదని తోటి ఉద్యోగుల రక్తాన్ని కళ్లజూస్తూ..

ఆఫీసులో భయానక వాతావరణం సృష్టించి తోటి ఉద్యోగుల వెన్నులో వణుకు పుట్టించాడు.

ఇలాగైతే ఆఫీసుల్లో పనిచేసేదెట్టా? సెలవు ఇవ్వలేదని తోటి ఉద్యోగుల రక్తాన్ని కళ్లజూస్తూ..

Bengal Govt Employee

Updated On : February 7, 2025 / 3:02 PM IST

ఓ ఉద్యోగి తనకు సెలవులు కావాలని ఆఫీసులో అడుగుతున్నాడు. అయితే, ఆయనకు సెలవులు ఇచ్చేందుకు నిరాకరించినందుకు తోటి ఉద్యోగులను కత్తితో పొడిచేశాడు. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డ తర్వాత కత్తితో, రక్తం అంటించిన చేతులతోనే ఆఫీసు పరిసరాల్లో తిగిరాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి కెమెరాలో రికార్డయ్యాయి.

అమిత్ కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగికి కొన్ని రోజులు సెలవు కావాల్సి వచ్చింది. అయితే, ఆఫీసులో ఆయన ఎంతగా బతిమిలాడుకున్నా ఆయన విజ్ఞప్తులను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.

Also Read: దారుణం.. గర్భిణీపై పైశాచికులు లైంగికదాడి చేసి.. రైల్లోంచి తోసేశారు..

దీంతో ఓ కత్తిని తీసుకొచ్చి, తనకు సెలవు ఇవ్వని వారిపై దాడి చేశాడు. అనంతరం భుజాలకు బ్యాగు తగిలించుకుని వెళ్లిపోతూ కనపడ్డ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన దగ్గరకు వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు.

రోడ్డుపై కొందరు అమిత్ కుమార్‌ వీడియోలను తీశారు. ఓ చేతిలో ఉన్న కత్తితో బెదిరిస్తూ అమిత్‌ కుమార్‌ ముందుకు వెళ్లాడు. ఆయనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు.

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సోడెపూర్ లోని ఘోలాలో అమిత్‌ కుమార్‌ నివసిస్తున్నాడని చెప్పారు. అతడు సాంకేతిక విద్యా విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. తోటి ఉద్యోగులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారని అన్నారు. అమిత్ కుమార్‌కు మానసిక సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.