Crocodile : బాబోయ్.. రోడ్డుపైకొచ్చిన భారీ మొసలి.. వాహనదారులు ఏం చేశారంటే? వీడియో వైరల్

మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చిప్లూన్‌లో రద్దీగా ఉండే రహదారిపైకి రాత్రివేళ భారీ కాయంకలిగిన మొసలి వచ్చింది.

Crocodile : బాబోయ్.. రోడ్డుపైకొచ్చిన భారీ మొసలి.. వాహనదారులు ఏం చేశారంటే? వీడియో వైరల్

Crocodile On Road In Maharashtra

Crocodile On Road In Maharashtra : భారీ మొసళ్లను మనం నదుల్లో, చెరువుల్లో చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో భారీ కాయం కలిగిన మొసలి రోడ్డుపైకొచ్చింది. అర్థరాత్రి వేళ రోడ్డుపై వాహనాలకు ఎదురుగా ఎలాంటి బెరుకు లేకుండా దర్జాగా నడుచుకుంటూ వెళ్లింది. భారీ కాయం కలిగిన మొసలిని చూసిన వాహనదారులు భయంతో వణికిపోయారు. మొసలికి వెళ్తున్న దారిలో వాహనదారులు వెనక్కు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైర్ గా మారింది. వీడియోలోని భారీ మొసలిని చూసిన నెటిజన్లు.. బాబోయ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Gas Cylinder Rate: గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొంకణ్ లోని చిప్లూన్ లో వర్షాల కారణంగా స్థానిక నది ఉప్పొంగుతోంది. దీంతో ఓ భారీ కాయం కలిగిన మొసలి అర్థరాత్రి సమయంలో రోడ్డుపైకొచ్చింది. మొసలి నడుచుకుంటూ రావడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. కొందరు వాహనదారులు మొసలిని వెంబడిస్తూ వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ మొసలి సంచరిస్తుండటంతో స్థానికుల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మొసలిని నదిలోకి పంపించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారీ కాయం కలిగిన మొసలి రోడ్డుపైకి రాడంతోపాటు.. దర్జాగా అది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.