మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్లు: అభినందించిన అధికార్లు

జంషెడ్‌పూర్ : శతృవుని కూడా ప్రేమించాలనే మానవ సంప్రదాయాన్ని అక్షరాల ఆచరిస్తున్నా మన సీఆర్ పీఎఫ్ జవాన్లు. జవాన్లకు మావోలకు జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ మావోయిస్టు దళానికి చెందిన ఓ మహిళకు సెంట్రల్ రిజర్వు పోలీసుఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్లు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ నగరంలో వెలుగుచూసింది.
జార్ఖండ్ రాష్ట్రంలోని సింగభూం జిల్లా అడవుల్లో జోనల్ కమాండర్ కందీహోన్ హగా నేతృత్వంలో 24 మంది మావోయిస్టు సమావేశమయ్యారనే సమాచారం అందుకున్నారు సీఆర్‌పీఎఫ్ జవాన్లు. 174, 60 బెటాలియన్లకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్లు..అదనుపు ఎస్పీ మనీష్ రామన్ నేతృత్వంలో అడవుల్లో కూబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులను లొంగిపొమ్మన్నారు. కానీ వారు జవాన్లపై కాల్పులు జరిపగా వారు కూడా ఎదురు కాల్పులు జరిపారు. దీంతో కొందరు మావోలు పారిపోయారు. అనంతరం ఘటనాస్థలిలో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ఓ మహిళా మావోయిస్ట్ ను గుర్తించారు.
ఆమెను సోనువా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం చాయ్ బసాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయం అవ్వటం..అధికంగా రక్తస్రావం అవ్వటంతో ఆ మహిళా మావోయిస్టుకు సీఆర్‌పీఎఫ్ ఎఎస్ఐ పంకజ్ శర్మ, హెడ్ కానిస్టేబుల్ బిచిత్ర కుమార్ స్వైన్, కానిస్టేబుల్ బీర్ బహదూర్ యాదవ్ లు రక్తదానం చేసి ఆమెకు ప్రాణం పోశారు. బాధ్యతల్లో భాగంగా కాల్పులు జరిపినా సాటి మనుషులు ఆమెకు రక్తదానం చేసిన వారిని ఉన్నతాధికారులు అభినందించారు.