భీకర గాలుల విధ్వంసం : పూరీ దగ్గర తీరం దాటిన తుఫాన్

ఉదయం 11 గంటల సమయంలో తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటింది. కన్ను వైశాల్యం 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటంతో..

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2019 / 05:29 AM IST
భీకర గాలుల విధ్వంసం : పూరీ దగ్గర తీరం దాటిన తుఫాన్

Updated On : May 3, 2019 / 5:29 AM IST

ఉదయం 11 గంటల సమయంలో తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటింది. కన్ను వైశాల్యం 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటంతో..

ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది ఫొని తుఫాన్. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. సముద్రంంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి. 2019, మే 3వ తేదీ ఉదయం 8 గంటలకు తీరాన్ని తాకాయి గాలులు. ఉదయం 11 గంటల సమయంలో తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటింది. కన్ను వైశాల్యం 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటంతో.. తీరానికి చేరువ అయ్యే సమయంలో మరింత స్పీడ్ గా రావటంతో గాలులు తీవ్రత అంతకంతకూ పెరిగింది. ఉదయం 8 గంటల నుంచే గాలుల వేగం 140 కిలోమీటర్లుగా ఉంటే.. తీరం దాటిన సమయంలో అది 200 కిలోమీటర్ల వేగంతో ఉంది. 

ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. పూరిళ్లు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. సెల్ టవర్లు విరిగిపోయాయి. భీకరమైన గాలులకు భయానక వాతావరణం నెలకొంది. 30 నిమిషాలుపైనే ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. పూరీ రోడ్లపై ఎక్కడ చూసినా విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు కనిపిస్తున్నాయి.

గాలుల తీవ్రతకు చాలా ఇల్లు దెబ్బతిన్నాయి. రోడ్డుపక్కన ఉండే చిన్న చిన్న దుకాణాలు, డబ్బాలు గాలులకు కొట్టుకుపోయాయి. భారీ వర్షం కూడా మొదలైంది. ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది ప్రభుత్వం. మరో 24 గంటలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. తుఫాన్ తీరం దాటిన పూరీ నగరంలో ఇప్పుడు బీభత్సంగా మారింది.