Indigo: చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానంకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
విమానాశ్రయం రన్‌వేపై వర్షపు నీరు ఉన్న సమయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. ల్యాండింగ్ అయ్యే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో ,,..

indigo flight
Indigo Flight: చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్ తుఫాన్ కారణంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోనూ ఎడతెరిపిలేని వర్షం కురవడంతో విమానాశ్రయంలోసైతం నీరు చేరింది. రన్‌వేపైకి వర్షపు నీరు రావడంతో విమానాలు దిగేందుకు, ఎగిరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
విమానాశ్రయం రన్‌వేపై వర్షపు నీరు ఉన్న సమయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. ల్యాండింగ్ అయ్యే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో అప్రమత్తమైన పైలెట్ తిరిగి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలో నీరు చేరడంతో శనివారం తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆదివారం తెల్లవారు జామునుంచి విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఆదివారం ఉదయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
✈️😓 If Baltimore Did Plane Landing Commentary… 😅
The IndiGo flight almost botched its touch down in Chennai due to cyclone Fengal.
Sheeeeeeeeeeit❗️ pic.twitter.com/7HhV3MMuXH
— AI Day Trading (@ai_daytrading) December 1, 2024