Cyclone Hamun : తుపానుగా మారిన అల్పపీడనం.. ఆ రాష్ట్రాలకు వర్ష సూచన

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, జాలర్లు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. Cyclone Hamun Update

Cyclone Hamun : తుపానుగా మారిన అల్పపీడనం.. ఆ రాష్ట్రాలకు వర్ష సూచన

Cyclone Hamun Update

Cyclone Hamun Update : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. దీనికి హమూన్ గా నామకరణం చేశారు. ఈ పేరుని ఇరాక్ సూచించింది. హమూన్ (Hamun) తుపాను కారణంగా భారత తీరంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఒడిశాలోని పారాదీప్ కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు 360 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ లోని ఖేపుపారాకు 510 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది.

వాయువ్య బంగాళాఖాతంలో ఈ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అక్టోబర్ 25న (బుధవారం మధ్యాహ్నం) బంగ్లాదేశ్ లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుపాను కారణంగా రాబోయే రెండు రోజుల్లో ఒడిశాలో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గాలులు కూడా వీస్తాయన్నారు.

Also Read : మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడం వెనుక కుట్రకోణం? ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఒడిశా ప్రభుత్వం. ఒడిశాపై నేరుగా ప్రభావం ఉండనప్పటికి, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, జాలర్లు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అటు వెస్ట్ బెంగాల్ లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్థానిక వాతావరణ విభాగం వెల్లడించింది.