ఏపీకి మహా తుపాన్ గండం : 24 గంటల్లో భారీ వర్షాలు

రుతుపవనాలు నిష్క్రమిస్తున్న సమయంలో భారీ వర్షాలు నమోవుతన్నాయి. క్యార్ తుపాన్ బీభత్సం సృష్టిస్తుంటే..మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, అరేబియా సముద్రంలో ఇది నాలుగో తుపాన్ అన్నారు. ఆరు గంటల్లో మరింత తీవ్రతరం కానుందని ఐఎండీ తెలిపింది.
లక్ష ద్వీప్ – ఆగ్నేయం, తూర్పు మధ్య అరేబియా సముద్రంపై బలమైన గాలులు వీస్తాయన్నారు. బుధవారం సాయంత్రం తుపాన్‌గా మారిందని, కేరళలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక తీర ప్రాంతాల్లో, దక్షిణ భాగం తమిళనాడులో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.., ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేరళ, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం, కోజికుడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read More : ఆర్థికమంత్రి విమర్శలకు రాజన్ దిమ్మతిరిగే కౌంటర్
భారీ వర్షం..ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే ప్రాంతాలు : –
> లక్ష ద్వీప్, కేరళ, కర్ణాటకలలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.
> తమిళనాడు, మహారాష్ట్ర తీర ప్రాంతాలు, గోవా, కర్ణాటకలలో భారీ వర్షాలు, ఉరుములు.
> ఆంధ్రప్రదేశ్, అండమాన్ & నికోబార్ దీవుల్లో విస్త్రతంగా వర్షాలు.
> మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చెదురుముదురు వర్షాలు.
> అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, ఒడిశా, జమ్మూ & కాశ్మీర్, గుజరాత్, చత్తీస్ గడ్‌లలో ఉరుమలతో కూడిన వర్షాలు.
> పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశలలో పొడి వాతావరణం.
There are very bright chances that #MahaCyclone will concentrate into a Severe Cyclonic Storm during the next few hours over Lakshadweep region and further become a Very Severe Cyclonic Storm after it remerges in the East-central #ArabianSea. #CycloneMahahttps://t.co/JZA5H6ItWH
— SkymetWeather (@SkymetWeather) October 31, 2019