Dalit Woman : దళిత మహిళను వివస్త్ర చేసి మూత్రం తాగించారు.. బీహార్ పాట్నాలో దారుణం

ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన ప్రమోద్ సింగ్, అన్షు తండ్రీకొడుకులు అని పోలీసులు వెల్లడించారు.

Dalit Woman : దళిత మహిళను వివస్త్ర చేసి మూత్రం తాగించారు.. బీహార్ పాట్నాలో దారుణం

Dalit woman stripped and beaten

Updated On : September 25, 2023 / 11:39 AM IST

Dalit Woman Stripped and Beaten : దేశంలో దళితులపై వివక్ష, దాడులు, హత్యలు, అవమానాలు నేటికీ కొనసాగుతూనేవున్నాయి. తాజాగా బీహార్ లోని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేసి ఆపై మూత్రం తాగించారు. తీసుకున్న రూ.1500 అప్పు వడ్డీతో సహా తిరిగి చెల్లించినా ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు.

అంతిటితో ఆగకుండా ఆమెను వివస్త్రను చేసి కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఆమెతో బలవంతంగా మూత్రం తాగించి మృగాల్లా వ్యవహరించారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tamil Nadu : దళిత మహిళ వండిన ఆహారం తినడానికి నిరాకరించిన విద్యార్ధులు.. జిల్లా కలెక్టర్ ఏం చేశారంటే?

ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన
ప్రమోద్ సింగ్, అన్షు తండ్రీకొడుకులు అని పోలీసులు వెల్లడించారు. నిందితులు మరో నలుగురు వ్యక్తులతో కలిసి బాధిత మహిళ ఇంటికి వెళ్లి ఆమెను బలవంతంగా వారి ఇంటికి తీసుకెళ్లారని పేర్కొన్నారు.

మహిళ ఎలాగోలా నిందితుల నుంచి తప్పించుకుని ఇంటికి చేరిందని చెప్పారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.