Kolkata Airport: ప్రమాదకర రేడియో ధార్మిక పదార్థం.. ఆ స్టోన్ అక్కడకెలా వచ్చింది?

బెంగాల్ సీఐడీ అధికారులు కోల్ కతా విమానాశ్రయం వద్ద అత్యంత ప్రమాదకరమైన రేడియో ధార్మిక పదార్థాలను కనుగొన్నారు. పట్టుబడిన రేడియో ధార్మిక పదార్థం రూ.4250 కోట్లు ఉండొచ్చని అంచనా..

Kolkata Airport: ప్రమాదకర రేడియో ధార్మిక పదార్థం.. ఆ స్టోన్ అక్కడకెలా వచ్చింది?

Kolkata Airport

Updated On : August 27, 2021 / 6:55 AM IST

Kolkata Airport: బెంగాల్ సీఐడీ అధికారులు కోల్ కతా విమానాశ్రయం వద్ద అత్యంత ప్రమాదకరమైన రేడియో ధార్మిక పదార్థాలను కనుగొన్నారు. పట్టుబడిన రేడియో ధార్మిక పదార్థం రూ.4250 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఒక స్టోన్ రూపంలో ఉండే ఈ రేడియో ధార్మిక పదార్ధాన్ని అణుబాంబులు తయారీలో వాడేది కాగా అజిత్ ఘోష్, సైలెన్ కర్మాకర్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి వీటిని స్వాధీనం చేసుకున్నారు.

అణుబాంబులు తయారీలో వాడే ఈ పదార్ధాన్ని ఎక్కడకి తరలిస్తున్నారన్నది విచారణ జరుపుతున్నారు. అసలు పట్టుబడిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు.. ఎక్కడ నుండి వచ్చారు.. ఎక్కడకి వెళ్తున్నారు.. ఆ రేడియో ధార్మిక పదార్థం గల స్టోన్ ను ఎక్కడకి తీసుకెళ్తున్నారన్నది బెంగాల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఏదైనా భారీ కుట్రకు ప్లాన్ చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు బెంగాల్ సీఐడీ వెల్లడించగా.. అసలు అంత భారీ విలువ గల స్టోన్ వీరి చేతికి ఎలా వచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది.