Daughter Gift : మొదటి జీతంతో తండ్రికి విలువైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. వీడియో వైరల్

తల్లిదండ్రులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ వారికి ఇష్టమైన వస్తువుల్ని బహుమతిగా ఇస్తే వాళ్ల అనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇన్షా అనే అమ్మాయి తన మొదటి జీతంతో తండ్రికి కొనిచ్చిన గిఫ్ట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Daughter Gift : మొదటి జీతంతో తండ్రికి విలువైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. వీడియో వైరల్

Daughter Gift

Updated On : April 5, 2023 / 1:30 PM IST

Daughter Gift : ఎంతో కష్టపడి చదివించి మంచి జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు (parents) తిరిగి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ వారికి ఎంతో ఇష్టమైనవి బహుమతిగా (gift) ఇస్తే వారి కళ్లలో కనిపించే ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేం. ఇక ప్రతి ఒక్కరికి మొదట అందుకునే శాలరీ (salary) ఎంతో అపురూపం. దాంతో ఏం చేస్తే బాగుంటుంది అని కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఇన్షా (Insha) అనే అమ్మాయి తన మొదటి శాలరీతో తండ్రికి ఓ ఖరీదైన గిఫ్ట్ కొంది. అది చూసిన తండ్రి తెగ ముచ్చటపడిపోయాడు. ఈ స్టోరి ఇప్పుడు వైరల్ అవుతోంది.

Keerthy Suresh : మా మంచి మహానటి.. ‘దసరా’ సినిమాకి పనిచేసిన 130 మందికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తి సురేష్..

డాక్టర్ అయిన ఇన్షా అనే అమ్మాయి తన మొదటి శాలరీ అందుకున్నాక తండ్రిని టీవీల దుకాణానికి తీసుకెళ్లింది. అక్కడ హోం థియేటర్ (home theatre) కొనాలని నిర్ణయించుకుంది. విషయం తెలిసి అంత క్లాస్ట్లీ వస్తువు ఎందుకని తండ్రి చిన్నగా మందలించాడు. అయినా ఆమె అస్సలు తగ్గలేదు. వెంటనే ప్యాక్ చేయించింది. ఇంటికి వచ్చిన హోం థియేటర్ ని చూసి ఇక ఆమె తండ్రి సంతోషంతో డ్యాన్స్ చేశాడు. షాపింగ్ మొదలు పెట్టిన దగ్గర్నుంచి ఇంట్లో బాక్స్ ఓపెన్ చేసేవరకు ఆమె తీసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

PM Narendra Modi: మోదీకి నోబెల్ శాంతి బహుమతి? నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

పోస్ట్ చివర్లో మీ మొదటి జీతంతో మీరు ఏం చేశారు? అని యూజర్లని ప్రశ్నించింది ఇన్షా. ఇక యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తండ్రి కోసం ఆమె చేసిన పనికి అందరూ అభినందనలు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Insha Samina (@sam.in.a.frame)