Iqbal Kaskar : దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్ట్

వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB)అధికారులు బుధవారం ముంబైలో అరెస్ట్ చేశారు.

Iqbal Kaskar : దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్ట్

Iqbal Kaskar

Updated On : June 23, 2021 / 4:37 PM IST

Iqbal Kaskar వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB)అధికారులు బుధవారం ముంబైలో అరెస్ట్ చేశారు. జమ్మూకశ్మీర్ నుంచి పంజాబ్ కి నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరోపణలపై కస్కర్ ని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

2003లో యూఏఈ నుంచి వచ్చిన కస్కర్ ని..ఓ వేధింపు కేసు దర్యాప్తులో భాగంగా 2017 సెప్టెంబర్ లో థానే పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని దావూద్ ఇబ్రహీం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కస్కర్ ఆపరేట్ చేస్తున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

కాగా,ఈ నెల ప్రారంభంలో దావూద్ సహచరుడైన గ్యాంగ్ స్టర్ పర్వేజ్ ఖాన్ తో సంబంధాల ఆరోపణలపై డ్రగ్స్ సరఫరాదారుడు హరీస్ ఖాన్ ని NCB అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఖాన్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తామని NCB తెలిపింది.