Canine Virus : కేరళలో వింత వ్యాధి కలకలం… వరుసగా మరణాలు
అసలే కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పుడు వింత వ్యాధులు భయపెడతున్నాయి. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Canine Virus
Canine Virus : అసలే కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పుడు వింత వ్యాధులు భయపెడతున్నాయి. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కోవలంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. శునకాలు వరుసగా మరణిస్తుండడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. గత రెండు వారాల వ్యవధిలో 20కి పైగా వీధి కుక్కలు చనిపోగా, వాటి మరణానికి కారణమైన వ్యాధి ఏంటన్నది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
Lose Weight : కసరత్తులు లేకుండా బరువు తగ్గటం ఎలాగో తెలుసా
కాగా, ఈ వ్యాధికి గురైన శునకాలు మరణించే ముందు వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడినట్టు గుర్తించారు. ఈ లక్షణాలు కనిపించిన రెండు రోజుల్లోనే కుక్కలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు.
Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!
దీనిపై పశు సంవర్ధకశాఖ అధికారులు స్పందించారు. గాల్లో వ్యాపించే ఓ వైరస్ కారణంగానే శునకాలు చనిపోతున్నట్టు అనుమానిస్తున్నారు. బహుశా ఇది కెనైన్ డిస్టెంపర్ అనే జబ్బు అయ్యుంటుందని, ఇది వైరస్ కారణంగా సోకుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ వైరస్ కుక్కల నుంచి మనుషులకు సోకినట్టు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.