Covid-19 : దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండవరోజు 30 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి.

Covid 19 (3)
Covid-19 : దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండవరోజు 30 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి. ఆదివారం 28 వేల మంది కరోనా బారినపడగా, సోమవారం 27,254 మందికి కరోనా సోకింది. కరోనాతో 219 మంది మృతి చెందారు. గడిచిన 24గంటల్లో 37,687 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 3,32,64,175 మందికి కరోనా సోకింది. ఇక కరోనాతో ఇప్పటివరకు 4,42,874మంది మృతి చెందారు.
Read More : Uttej : నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం
ఇక కేరళ విషయానికి వస్తే.. ఇక్కడ గడిచిన 24 గంటల్లో 20,240 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 67 మంది మృతి చెందారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతం కేసులు ఒక్క కేరళ నుంచే వస్తున్నాయి. ఇక్కడ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తే దేశంలో ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.
Read More : Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది ఏపీ కూలీలు మృతి!
వ్యాక్సినేష విషయానికి వస్తే.. ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 53,38,945 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది. దీంతో ఇప్పటివరకు 74,38,37,643 కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశామని వెల్లడించింది. దేశంలో కరోనా టెస్టులు 54,30,14,076కు చేరాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి తెలిపింది. ఆదివారం ఒక్క రోజే 12,08,247 నమూనాలకు కరోనా పరీక్షలు చేశామని వెల్లడించింది.