రాహుల్ పై దీపికా ప్రశంసలు…ప్రధాని అవడం ఖాయం

  • Published By: venkaiahnaidu ,Published On : September 28, 2020 / 03:47 PM IST
రాహుల్ పై దీపికా ప్రశంసలు…ప్రధాని అవడం ఖాయం

Updated On : September 28, 2020 / 4:11 PM IST

deepika padukone praising rahul gandhi:బాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపిక పదుకొనెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. .గతంలో ఓ ఇంటర్య్వూలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై దీపిక ప్రశంసలు కురిపించిన వీడియో ఒక్కటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డ్రగ్స్‌ కేసులో భాగంగా శనివారం దీపిక విచారణ ముగిసినప్పటి నుంచి ఈ వీడియో వైరల్‌గా మారింది.


వైరల్ అవుతున్న వీడియోలో… భవిష్యత్‌ లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయని, తనకు ఇష్టమైన నేతల్లో రాహుల్‌ ముందుంటారని దీపికా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అసలైన దేశభక్తి తనకు రాహుల్‌లో కనిపిస్తుందని, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మంచి నాయకుడికి ఆయనే సరైన ఉదాహరణ అని, ప్రధానమంత్రి అవుతారనే నమ్మకం తనకు ఉందన్నారు.



కాగా, సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్ ‌ అనుమానాస్పద మృతి తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిలో భాగంగానే నటీమణులు రకుల్‌ ప్రీత్‌సింగ్‌, దీపిక పదుకొనె, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌లను విచారించింది. వీరి నుంచి కీలకమైన సమాచారాన్ని అధికారులు రాబట్టినట్టు సమాచారం.