చైనాతో ఉద్రిక్తతల వేళ రష్యాకు రాజ్‌నాథ్

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం(సెప్టెంబర్-2,2020) రష్యాకు వెళ్తున్నారు. మూడు రోజుల పాటు అయన రష్యాలో పర్యటిస్తారు. మాస్కోలో జరిగే షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా రష్యా, చైనా రక్షణ మంత్రులతో రాజనాథ్ కీలక చర్చలు జరుపుతారని సమాచారం. ఈ నేపథ్యంలో లడఖ్ సరిహద్దులో భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గవచ్చని తెలుస్తోంది.
ఐరోపా, ఆసియా దేశాల రాజకీయ, ఆర్థిక, భద్రత కూటమి అయిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ని 2001 జూన్ 15న చైనాలోని షాంఘైలో ప్రకటించారు. చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ వ్యవస్థాపక సభ్య దేశాలుగా 2003 సెప్టెంబర్ 19న ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. 2017 జూన్ 9న భారత్, పాకిస్థాన్ కూడా సభ్య దేశాలుగా చేరాయి. దీంతో ఈ కూటమి సభ్య దేశాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.