MCD Polls: ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ బీజేపీ చీఫ్ పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా

ఈ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 104 స్థానాలు గెలుచుకుంది. వాస్తవానికి ఢిల్లీ మున్సిపాలిటీని ఆప్ 15 ఏళ్లుగా పాలిస్తోంది. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్లో పోటీకి దిగింది. గత ఎన్నికల్లో బీజేపీ 181 సీట్లు గెలిచింది. అలాంటి ఈసారి కేవలం 100 మార్క్ దగ్గరే ఆగిపోవడం పార్టీలో నైరాశ్యాన్ని నింపింది

MCD Polls: ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ బీజేపీ చీఫ్ పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా

Delhi BJP president Adesh Gupta steps down following defeat in MCD polls

Updated On : December 11, 2022 / 5:18 PM IST

MCD Polls: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ భారతీయ జనతా పార్టీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఆదివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. అయితే తదుపరి అధ్యక్షుడిని నియమించేంత వరకు ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్‭దేవాను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించనున్నట్లు సమాచారం. ఈ విషయమై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాట్లాడుతూ “బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలను అనుసరించి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా రాజీనామాను మేము ఆమోదించాము. తదుపరి నోటీసు వచ్చే వరకు ఢిల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’’ అని తెలిపారు.

AAP vs Congress: బీజేపీకి లాభం చేకూర్చేలా ఎన్నికల పోటీ.. ఆప్ తీరుపై కాంగ్రెస్ గరంగరం

ఈ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 104 స్థానాలు గెలుచుకుంది. వాస్తవానికి ఢిల్లీ మున్సిపాలిటీని ఆప్ 15 ఏళ్లుగా పాలిస్తోంది. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్లో పోటీకి దిగింది. గత ఎన్నికల్లో బీజేపీ 181 సీట్లు గెలిచింది. అలాంటి ఈసారి కేవలం 100 మార్క్ దగ్గరే ఆగిపోవడం పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఇక శనివారం బీజేపీపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దాడి ప్రారంభించారు. బీజేపీ అనేక యంత్రాంగాన్ని మోహరించి, ఎన్నికలను కఠినతరం చేసినప్పటికీ ఆప్‭ను అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమనే ఎన్నుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Rajasthan: యూటర్న్ తీసుకున్న అశోక్ గెహ్లాట్.. సచిన్ పైలట్‭తో ఇక వైరం లేనట్టేనా?