కారు ఆపమన్న ట్రాఫిక్ పోలీసును 2 కిలోమీటర్లు లాక్కెళ్లాడు

కారు ఆపమన్న  ట్రాఫిక్ పోలీసును 2 కిలోమీటర్లు లాక్కెళ్లాడు

Updated On : February 3, 2020 / 9:08 AM IST

పోలీస్ చేజింగ్ అంటే ముందో వెహికల్ వెనుకో వెహికల్ కామన్. ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది. ఓ వ్యక్తిని ఆపే క్రమంలో పోలీస్ చేజింగ్ చేసే సమయం లేక ఒక్క సారిగా అతని కారుపైకి దూకాడు. పోలీసు అడ్డురాగానే కారు ఆపుతాడనుకున్నాడు. అలా అంచనా వేసి తప్పులో కాలేశాడు. ఫలితంగా కారు బొనెట్ పైనే రెండు కిలోమీటర్ల వరకూ ప్రయాణించాడు. 

సంవత్సరం క్రితం ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. దీనిపై అధికారులు ఇన్నాళ్లకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా కారును ఆపే ప్రయత్నం చేశారు. నంగ్లోయ్ చౌక్ వద్ద కారు స్లో అయింది. రోడ్డు పక్క నిల్చొన్న  సునీల్ అనే పోలీస్ కారు సమీపించాడు. 

ఉన్నట్టుండి ఒక్కసారిగా కారు వేగం పుంజుకుంది. అప్పటికే 
సిద్ధంగా ఉన్న పోలీసు కారుపైకి డైవింగ్ చేశాడు. బొనెట్ మీద పడి కారు ఆపేంతవరకూ వెనక్కు చూడకుండా ప్రయత్నించాడు. అలా 2కిలోమీటర్ల వరకూ ప్రయాణించాడు. కారులో ఉన్న సహ ప్రయాణికుడు ఈ ఘటన మొత్తం వీడియో ద్వారా చిత్రీకరించాడు. బతిమాలాడుతుండగా ఎట్టకేలకు కారు ఆపి పోలీసును కిందకి దించాడు. అప్పటికే గాయాలకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు.