Delhi High Court : కాంట్రాక్టు ఉద్యోగినికి ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిలో సహాయకురాలిగా పని చేస్తున్న ఓ ఉద్యోగిని ప్రసూతి సెలవులు తీసుకోగా యూనివర్సిటీ ఆమెను సర్వీస్ నుంచి తొలగించింది.

Delhi High Court (1)
Delhi High Court – Contract Employee : కాంట్రాక్టు ఉద్యోగినికి ప్రసూతి సెలవులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగినికీ ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగిని అన్న కారణంగా ప్రసూతి సెలవులను నిరాకరించడం అమానవీయమని తెలిపింది. కాంట్రాక్టు ఉద్యోగం అనే సాకుగా చూపి సెలవులను నిరాకరించడం ఆమె ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుందని వెల్లడించింది.
ఢిల్లీ యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిలో సహాయకురాలిగా పని చేస్తున్న ఓ ఉద్యోగిని ప్రసూతి సెలవులు తీసుకోగా యూనివర్సిటీ ఆమెను సర్వీస్ నుంచి తొలగించింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ చంద్రధరి సింగ్ విచారణ చేపట్టారు.
African mask : ఈ మాస్క్ ధర రూ.36 కోట్లు.. అమ్మేసిన తర్వాత దాని విలువ తెలిసి కోర్టుకెళ్లిన జంట..
కాంట్రాక్టు ఉద్యోగం అయినంత మాత్రాన నోటీసులు ఇవ్వకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం చట్టవిద్ధమని స్పష్టం చేసింది. వెంటనే ఆమెను సర్వీసులోకి తీసుకోవాలని యూనివర్సిటీకి తెలిపింది. నష్టపరిహారంగా ఆమెకు రూ. 50వేలు చెల్లించాలని ఆదేశించింది.