ఓటు మాకే వేసేలా చూడు దేవుడా : పోలింగ్‌కు ఒక్క రోజు ముందు పూజలు

  • Published By: madhu ,Published On : February 7, 2020 / 12:28 PM IST
ఓటు మాకే వేసేలా చూడు దేవుడా : పోలింగ్‌కు ఒక్క రోజు ముందు పూజలు

Updated On : February 7, 2020 / 12:28 PM IST

దేశ రాజధాని ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 08వ తేదీ నుంచి పోలింగ్ స్టార్ట్ కానుంది. ఆప్, బీజేపీ నువ్వా నేనా అనుకుంటున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని ఆప్, కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ..భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఓటర్లు ఎవరికి పట్టం కడుతారనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రచారం నిర్వహించిన నేతలు..ఓటర్లను ఆకట్టుకొనే పనిలో పడ్డాయి. 

ఓటర్లు తమకే ఓటు వేసేలా చూడు..పార్టీ అధికారంలోకి వచ్చేలా చూడు స్వామి అంటున్నారు పార్టీ నేతలు. ఎన్నికల పోలింగ్‌ కంటే ముందు ఒక రోజు అంటే..2020, ఫిబ్రవరి 07వ తేదీ శుక్రవారం ఆలయాల్లో లీడర్స్ పూజలు నిర్వహించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీజేపీ చీఫ్ మనోజ్ తివారీలు హనుమాన్ టెంపుల్‌లో పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అర్చకులు సన్మానం చేశారు. 

ఢిల్లీ రాష్ట్రంలో మొత్తం 70 నియోజకవర్గాలున్నాయి. 
2020,. జనవరి 14వ తేదీన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్. 
 

2020, ఫిబ్రవరి 08న పోలింగ్.
2020, ఫిబ్రవరి 11న కౌంటింగ్..అదే రోజు తుది ఫలితాలు.
గత ఎన్నికల్లో ఆప్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో విజయం.

టాప్ క్యాండిడేట్స్ :-
కాంగ్రెస్ : ఆదర్శ్ శాస్త్రి ఇతను ద్వారకా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. అల్కా లాంబా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. చాందినీ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. 2015లో ఆప్ పార్టీ నుంచి గెలుపొందారు. మాజీ మంత్రులు హరూన్ యూసుఫ్, అరవిందర్ సింగ్‌లు బలిమరన్, గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ కీలక నేత సుభాష్ చోప్రా కూతురు శివానీ కల్‌కజీ నుంచి బరిలో ఉన్నారు. 
మాజీ స్పీకర్ యోగానంద్ శాస్త్రీ కుమార్తె ప్రియాంక సింగ్ ఆర్కే పురం నుంచి పోటీకి దిగుతున్నారు. 

ఆప్ : ఆప్ అధినేత, చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పాట్పర్‌గంజ్ నుంచి పోటీకి దిగుతున్నారు. 
చాందీని చౌక్ నుంచి పర్నాల్ సింగ్, ద్వారకా నుంచి వినయ్ కుమార్, గాంధీ నగర్ నుంచి డిపు చౌదరీలు పోటీ పడుతున్నారు. 
వీరితో పాటు రాఘవ్ చద్దా, సోమ్ నాథ్ భారతీ, రాఘవ్ చద్దాలున్నారు. 

బీజేపీ : న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి సునీల్ యాదవ్ ఉన్నారు. ఆప్ పార్టీ నేత కేజ్రీవాల్‌తో ఆయన పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా (రోహిణి), ఓమ్ ప్రకాష్ శర్మ (విశ్వాస్ నగర్), జగదీష్ ప్రధాన్ (ముస్తాఫాబాద్) నుంచి బరిలో ఉన్నారు.