Lockdown : ఢిల్లీలో మళ్లీ పొడిగింపు..

వైరస్ ఉధృతి దృష్ట్యా ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.

Lockdown : ఢిల్లీలో మళ్లీ పొడిగింపు..

Delhi

Updated On : May 1, 2021 / 7:06 PM IST

Delhi : దేశ రాజధానిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉంటుండడంతో ఢిలీ జనాలు భయకంపితులు అయిపోతున్నారు. ఎవరు ఎప్పుడు ప్రాణాలు విడుస్తారో తెలియడం లేదు. వైరస్ కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. అయినా..వైరస్ విస్తరిస్తూనే ఉంది.

దీంతో ఢిల్లీ ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. వైరస్ ఉధృతి దృష్ట్యా ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

లాక్ డౌన్ కొనసాగించడమే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో కరోనా విజృంభిస్తుండడంతో ఏప్రిల్ 19వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా..కేసుల పెరుగుదలలో మార్పు రాకపోవడంతో మే 03వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు సోమవారం ఉదయం 05 గంటలకు పూర్తి కావడంతో తాజా మరో వారం పాటు లాక్ డౌన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.