Delhi : ఢిల్లీలో కొత్తగా 134 కోవిడ్ కేసులు
కోవిడ్ కోరల నుంచి ఢిల్లీ బయటపడుతోంది.

Delhi (2)
Delhi కోవిడ్ కోరల నుంచి ఢిల్లీ బయటపడుతోంది. కొద్ది రోజులుగా ఢిల్లీలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 134 కొత్త కోవిడ్ కేసులు,ఎనిమిది మరణాలు నమోనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. దీంతో ఢిల్లీలో కోవిడ్ కేసుల సంఖ్య 14,32,778కి..మరణాల సంఖ్య 24,933కి చేరినట్లు తెలిపింది. గడిచిన 24గంటల్లో 467మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.
గడిచిన 24గంటల్లో 67,916శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు తెలిపింది. ఢిల్లీలో పాజిటివ్ రేటు 0.2శాతంగా ఉందని పేర్కొంది. మరణాల రేటు 1.74శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇక, ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 1918కి ఉన్నట్లు తెలిపింది. మార్చి-10 తర్వాత ఇదే అత్యల్పమని పేర్కొంది. మార్చి-10న ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 1900గా ఉండింది.