మిస్టరీ వీడింది..! రాష్ట్రపతి భవన్‌లో పులి.. క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు

వీడియోను చూసిన నెటిజన్లు అది పులినా..? పిల్లినా? అనే సందేహాలను వ్యక్తం చేశారు. అది అచ్చం చిరుత పులిలా నడుచుకుంటూ వెళ్లిందని కొందరు

మిస్టరీ వీడింది..! రాష్ట్రపతి భవన్‌లో పులి.. క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు

Rashtrapati Bhavan

Rashtrapati Bhavan : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అలాగే, కేంద్ర మంత్రులుగా కూడా నేతలు ప్రమాణం చేశారు. వీవీఐపీలు సహా పెద్ద సంఖ్యలో అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అభివాదం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో వెనుక భాగంలో ఓ జంతువు వెళ్తున్నట్లు కనిపించింది. అది అచ్చం చిరుత పులిలా ఉండటంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read : హర్భజన్ సింగ్ దెబ్బకు క్షమాపణలు చెప్పిన పాక్ మాజీ క్రికెటర్.. అసలు గొడవ ఏమిటంటే?

వీడియోను చూసిన నెటిజన్లు అది పులినా..? పిల్లినా? అనే సందేహాలను వ్యక్తం చేశారు. అది అచ్చం చిరుత పులిలా నడుచుకుంటూ వెళ్లిందని కొందరు నెటిజన్లు పేర్కొనగా.. రాష్ట్రపతి భవన్ లో చిరుత పులి ఎందుకు ఉంటుందంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీయడంతో ఢిల్లీ పోలీసులు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

Also Read : పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి కీలక శాఖలు

వీడియో సంగతి తెలియగానే మేం రాష్ట్రపతి భవన్ భద్రతా సిబ్బందితో మాట్లాడాం. రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఎలాంటి చిరుతపులి లేదని వారు చెప్పారు. కేవలం శునకాలు, పిల్లులు మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేశారని ఢిల్లీ పోలీసులు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వీడియోలో కనిపించిన జంతువు ఇళ్లలో తిరగాడే పిల్లి మాత్రమే. దయచేసి వదంతులను పట్టించుకోకండి అంటూ ప్రజలకు ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.