Dengue In Delhi : ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగ్యూ మరణం నమోదు

ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగీ మ‌ర‌ణం న‌మోదైందని సోమవారం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(SDMC) అధికారులు తెలిపారు.

Dengue In Delhi : ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగ్యూ మరణం నమోదు

Dengue

Updated On : October 18, 2021 / 3:35 PM IST

Dengue In Delhi ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగీ మ‌ర‌ణం న‌మోదైందని సోమవారం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(SDMC) అధికారులు తెలిపారు. SDMC తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం..ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 723 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క అక్టోబర్ నెలలోనే ఇప్పటివరకు న‌మోదైన కేసులు 382 ఉండటం ఆందోళనకరం.

గ‌త ఏడాది జ‌న‌వ‌రి- అక్టోబ‌ర్ మధ్య మొత్తం 266 డెంగీ కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఏడాది చివ‌రిక‌ల్లా ఆ సంఖ్య 1072కు పెరిగింది. గ‌త ఏడాది ఒకే ఒక్క డెంగీ మ‌ర‌ణం చోటుచేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటికే ఒక‌రు డెంగీతో ప్రాణాలు కోల్పోయారు.

ఇక,ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నెల‌లో కూడా ఢిల్లీలో మొత్తం 217 డెంగీ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త మూడేళ్లలో సెప్టెంబ‌ర్ నెల‌లో న‌మోదైన డెంగీ కేసుల‌తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ‌ని ఢిల్లీ ప్ర‌భుత్వ గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. ఇక, అక్టోబర్ నెలలో ఢిల్లీలో 382 కొత్త డెంగ్యూ కేసులతో పాటు 29 మలేరియా కేసులు,13 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి.

డెంగ్యూ వైరస్..జ్వరం మరియు రక్తస్రావ లక్షణాలకు కారణమవుతుంది. డెంగ్యూ ఇన్ఫెక్షన్లు DEN-1, DEN-2, DEN-3 మరియు DEN-4 అనే నాలుగు దగ్గరి సంబంధం ఉన్న వైరస్ల వల్ల కలుగుతాయి. ఈ నాలుగు వైరస్ లను సెరోటైప్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కటి..మానవ రక్త సీరంలోని ప్రతిరోధకాలతో విభిన్న పరస్పర చర్యలను కలిగి ఉంటాయి.

ALSO READ  ULF : కశ్మీర్ లో పౌరుల హత్యకు పాల్పడింది మేమే..వలస కూలీలకు హెచ్చరిక