ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం నగరంగా ఢిల్లీ

2016, 2017 సంవత్సరాల్లో ఇదే సీజన్లో అంటే నవంబరు నెలలో ఉన్న కాలుష్యం స్థాయి కంటే తారా స్థాయికి చేరుకుంది. ఉదయం 11గంటల వరకూ మంచు నుంచి ఢిల్లీ బయటపడటం లేదు.

ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం నగరంగా ఢిల్లీ

Updated On : November 4, 2019 / 4:36 AM IST

2016, 2017 సంవత్సరాల్లో ఇదే సీజన్లో అంటే నవంబరు నెలలో ఉన్న కాలుష్యం స్థాయి కంటే తారా స్థాయికి చేరుకుంది. ఉదయం 11గంటల వరకూ మంచు నుంచి ఢిల్లీ బయటపడటం లేదు.

అసలే కాలుష్య స్థాయి ఎక్కువగా కనిపించే ఢిల్లీ.. దీపావళి సెలబ్రేషన్స్ తర్వాత తారాస్థాయికి చేరింది. బయటకు వెళ్లాలంటే మాస్క్ లు తప్పనిసరిగా మారింది. శీతాకాలం మంచుతో పాటు పొగ కాలుష్యం తోడవడంతో ప్రపంచంలోనే అత్యథిక కాలుష్యం ఉన్న సిటీగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. 

2016, 2017 సంవత్సరాల్లో ఇదే సీజన్లో అంటే నవంబరు నెలలో ఉన్న కాలుష్యం స్థాయి కంటే తారా స్థాయికి చేరుకుంది. ఉదయం 11గంటల వరకూ మంచు నుంచి ఢిల్లీ బయటపడటం లేదు. ఇదెలా ఉందంటే ప్రపంచ కాలుష్య నగరాల్లో రెండో స్థానంలో ఉన్న ఢాకా ప్రాంతంలో నమోదయ్యే కాలుష్యానికి ఆరు రెట్లు ఎక్కువగా ఉందంట. 

కాలుష్యం తగ్గించేందుకు మూడో సారి సరిబేసి విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. దీని పర్యవేక్షణ కోసం 200మంది ట్రాఫిక్ పోలీసులను నియమించారు. ట్రక్కుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేదించారు. 2వేల అదనపు బస్సులతో పాటు, 61 అదనపు మెట్రో ట్రిప్పులు వేయాలని ఆదేశించారు. ఈ మేర పరిశ్రమలు మూసివేయడంతో పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.