ATMలలో జనవరి 2020 నుంచి రూ.2వేల నోట్లు కనిపించవ్!

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ సమయంలో న్యూ ఇయర్ వార్నింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 2020నుంచి ఏటీఎంలలో దొరకవు.
పాత నోట్లన్నీ 2019 డిసెంబరు 31వరకే చెల్లుబాటు అవుతాయని వాటిని త్వరగా మార్చేసుకోవాలి. పైగా ఒక వ్యక్తి రూ.50వేలు మాత్రమే నగదు బదిలీ చేసుకోగలడు’ అనేది ఆ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ లో నిజం ఏ మాత్రం లేదని ఇదంతా ఫేక్ అని కొట్టిపారేశారు అధికారులు. ఆర్బీఐ రూ.2వేల నోట్లను రద్దు చేసే ఆలోచనే చేయలేదని తెలిపారు.
మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఇలా సమధానమిచ్చారు. రూ.2వేల నోట్లను అక్టోబరు నుంచి రద్దు చేస్తామనడంలో వాస్తవం లేదు. ‘ఇవన్నీ రూమర్లు మాత్రమే. అలాంటి నోటిఫికేషన్ ఆర్బీఐ చేయలేదు. ఇంకా వివరాలు కావాలంటే ఆర్బీఐ సైట్‌లో చూడండి’ అని వివరించింది.
2016లోనూ సంవత్సరం చివర్లో అంటే నవంబరు నెలలో కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేసి సంచలనానికి తెరలేపింది. ఇక అప్పటినుంచి అదే భయాన్ని నెటిజన్లలో రెచ్చగొడుతూ.. సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి.