Ashok Gehlot: కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెరపైకి అశోక్ గెహ్లాట్ పేరు.. ఆయన ఏమన్నారంటే?

రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు  అప్పగించేందుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.. ఈ విషయంపై గెహ్లాట్ స్పందించారు. కేవలం మీడియా ద్వారానే నేను ఆ వార్తలు విన్నానని, అంతకు మించి తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు.

Ashok Gehlot: కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెరపైకి అశోక్ గెహ్లాట్ పేరు.. ఆయన ఏమన్నారంటే?

Ashok Gehlot

Updated On : August 24, 2022 / 1:32 PM IST

Ashok Gehlot: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండాలని పార్టీలోని అధికశాతం మంది కోరుతుండగా రాహుల్ మాత్రం అందుకు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకా వాద్రాపేరు తెరపైకి వచ్చింది. ప్రియాంకా వాద్రా కొన్నేళ్లుగా పొలిటిక్స్ లో చురుగ్గా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. అయితే ప్రియాంకా వాద్రాసైతం అధ్యక్ష పదవికి విముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు  అప్పగించేందుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Bharat Jodo Yatra: 12 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర .. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభం..

ఈ విషయంపై గెహ్లాట్ స్పందిస్తూ.. మీడియా ద్వారానే నాకు ఈ విషయం తెలిసిందని, అంతకుమించి వివరాలేమీ నాకు తెలియదంటూ అన్నాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుతం నేను ఆ రాష్ట్ర పరిశీలకుడిగా ఉన్నానని, రాజస్థాన్ లో నా బాధ్యతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నాపేరును పరిశీలిస్తున్నట్లు మీడియాద్వారానే తెలుసుకున్నానని అన్నారు.

Rahul Gandhi: రేపిస్టులకు మద్దతు.. సిగ్గనిపించడం లేదా.. ప్రధానిపై రాహల్ ఫైర్

అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. గాంధీల కుటుంబానికి విశ్వాసపాత్రుడు. అందుకే ఇటీవల సోనియాగాంధీ గెహ్లాట్ తో సమావేశమై అధ్యక్ష పదవి చేపట్టాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గెహ్లాట్ రాజస్థాన్ సీఎంగా ఉన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే సీఎం పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గెహ్లాట్ అందుకు అంగీకరించే పరిస్థితి ఉండదని కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు పేర్కొంటున్నారు. గెహ్లాట్ పేరు తెరపైకి రావడం మీడియా సృష్టేనన్న వాదనను పలువురు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెల 20లోగా పార్టీ నూతన సారథి ఎన్నిక పూర్తవుతుందని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుడి ఎంపిక విషయంలో వేగం పెంచింది.