Bharat Jodo Yatra: 12 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర .. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభం..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో యాత్ర ప్రారంభం కానుంది. ప్రతీ రోజూ 25 కి.మీ సాగే యాత్ర 3,500 కిలో మీటర్లు 12 రాష్ట్రాల్లో సాగనుంది. ఈ యాత్రలో భాగంగా నిర్వహించే బహిరంగ సభల్లో సోనియా, ప్రియాంక వాద్రాలు పాల్గోనున్నారు.

Bharat Jodo Yatra: 12 రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర .. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభం..

Rahul Gandhi

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలతో పాలన సాగిస్తోందని, అన్ని వస్తువులపై ధరలు పెంచి పేద, సామాన్య ప్రజలను ఇబ్బందులు పాలుచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపేందుకు, బీజేపీ చేస్తోన్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు సుదీర్ఘ పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు.

Rahul Gandhi: రేపిస్టులకు మద్దతు.. సిగ్గనిపించడం లేదా.. ప్రధానిపై రాహల్ ఫైర్

యాత్రకు సంబంధించిన లోగో, ట్యాగ్ లైన్, పోస్టర్ ను పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లు విడుదల చేశారు. మిలే కదం.. జుడే వతన్( అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం) అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వారు తెలిపారు. యాత్రకోసం ప్రత్యేక వెబ్ సైట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఈ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలవుతోంది. అక్కడి నుంచి 148 రోజుల పాటు కొనసాగి కశ్మీర్ లో ముగియనుంది. ప్రతీరోజు 25 కి.మీ సాగే యాత్ర 12 రాష్ట్రాల మీదుగా 3,500 కి.మీ కొనసాగుతోంది.

Rahul Gandhi is silent: రాజస్తాన్ ఘటనపై రాహుల్ గాంధీకి బీజేపీ ప్రశ్నల వర్షం

ఈ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు మరో 50 మంది కాంగ్రెస్ నేతలు తొలుత పాదయాత్రలో పాల్గోనున్నారు. మార్గ మధ్యలో ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు యాత్రలో భాగస్వాములవుతారు. అయితే ఈ యాత్ర ఏదో ఒక పార్టీకి పరిమితం చెందిన యాత్రగా కాకుండా అన్ని వర్గాలను ఏకం చేసేందుకు యాత్రను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్లు తెలిపారు. ఈ క్రమంలో యాత్రకు సంబంధించిన లోగో పార్టీ గుర్తును ఎక్కడా పొందుపర్చలేదు. ఇదిలాఉంటే ఈ యాత్రలో భాగంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. పలు ప్రాంతాల్లో జరిగే సభల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ప్రియాంక వాద్రా కూడా పాల్గోనున్నారు. పాదయాత్ర సమయంలో రాహుల్ గాంధీ మార్గం మధ్యలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే వసతుల్లోనే బసచేయనున్నారు.