karnataka : 150 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని.. 230 కి.మీ. ప్రయాణించి భార్యను చంపిన కానిస్టేబుల్

కిషోర్ ను కఠిన శిక్ష విధించాలని ప్రతిభ తండ్రి సుబ్రమణి కోరారు. అలాగే కిషోర్ తల్లి కూడా తన కూతురు ప్రతిభను వరకట్నం కోసం వేధించినట్లు ఆరోపించారు. ప్రతిభ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిషోర్ పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

karnataka : 150 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని.. 230 కి.మీ. ప్రయాణించి భార్యను చంపిన కానిస్టేబుల్

constable kill wife

Updated On : November 8, 2023 / 4:10 PM IST

Constable Kill Wife In Karnataka : ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో పోలీస్ కానిస్టేబుల్ భార్యను హత్య చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. 150 సార్లు ఫోన్ కాల్ చేసినా లిఫ్ట్ చేయకుండా సమాధానం ఇవ్వకపోవడంతో కానిస్టేబుల్ 230 కి.మీ ప్రయాణించి భార్యను హత్య చేశాడు. పోలీస్ కానిస్టేబుల్ భార్య ఇటీవల పుట్టినింట్లో శిశువుకు జన్మనిచ్చింది. అయితే కానిస్టేబుల్ భార్యపై అనుమానంతో ఫోన్ చేసి దుర్భాషలాడారు. దాంతో ఆమె కాల్ కట్ చేశారు.

ఆమెకు మళ్లీ ఫోన్ చేశారు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అలా దాదాపు 150 సార్లు భార్యకు ఫోన్ చేసినా ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో సహనం కోల్పోయాడు. దీంతో తాను ఉంటున్న చామరాజనగర్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న భార్య పుట్టినిల్లైన హోస్ కేటేకి వెళ్లాడు. కిషోర్ మొదట పురుగుల మందు తాగి అనంతరం దుపట్టాతో భార్య గొంతును పిసికి చంపేశాడు.

Also Read : స్కూల్ లో 5కే రన్ రేస్ లో పరుగెత్తుతూ గుండె పోటుతో బాలుడు మృతి

మృతురాలు ప్రతిభ (24) 11 రోజుల క్రితం పుట్టినిల్లైన హోస్ కోటే దగ్గర్లోని కాలాతూర్ లో శిశువుకు జన్మనిచ్చింది. నిందితుడు డి.కిషోర్ (32) పరిస్థితి విషమంగా ఉంది. డి.కిషోర్ రామసముద్రంలోని చామరాజనగర్ తూర్పు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అతను చికిత్స నిమిత్తం కోలార్ తమాకలోని ఆర్ఎల్ జలప్ప ఆస్పత్రిలో చేరారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మెరుగుగైన వైద్యం కోసం హోస్ కేటే పోలీసులు అతన్ని మరో ఆస్పత్రికి తరలించారు. కిషోర్ డిశ్చార్జ్ అయిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. బెత్తహలసూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న సుబ్రమణి చిన్న కూతురు ప్రతిభ. ప్రతిభ బీఈ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ చేశారు. కోలార్ జిల్లా వీరపుర గ్రామానికి చెందిన కిషోర్ తో ప్రతిభకు నవంబర్12,2022న వివాహం జరిగింది. కిషోర్ భార్య ప్రతిభ క్యారెక్టర్ పై అనుమానం రావడంతో ఆమెకు ఫోన్ కు వస్తున్న మెసేజులు, కాల్స్ వివరాలను చెక్ చేశారు. భార్యకు మెస్సేజ్ లు, కాల్స్ చేస్తున్న వ్యక్తుల గురించి ఆమెను ప్రశ్నించాడు. ప్రతిభ కొంతమంది మగవారితో సన్నిహితంగా ఉన్నట్లుగా గమనించాడు.

Also Read : కూతురు సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎందుకో తెలుసా?

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి తిట్టారు. దీంతో ప్రతిభ ఫోన్ మాట్లాడుతూ ఏడ్చారు. గమనించిన ప్రతిభ తల్లి వెంకటలక్ష్మమ్మ ఫోన్ తీసుకుని కాల్ కట్ చేశారు. ప్రతిభను ఏడ్చకూదని, ఏడ్చితే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందని తల్లి చెప్పారు. అంతకాకుండా కిషోర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయొద్దని, సమాధానం ఇవ్వొద్దని ప్రతిభకు చెప్పింది. మరుసటిరోజు (సోమవారం) ఉదయం ఫోన్ చూడగా ప్రతిభ ఫోన్ కు కిషోర్ 150 సార్లు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఆమె తెలియజేశారు.

సోమవారం ఉదయం 11.30 గంటలకు కిషోర్ ప్రతిభ పుట్టింటికి వెళ్లాడు. ప్రతిభ తల్లి వెంకటలక్మమ్మ టెర్రస్ పైకి వెళ్తుండగా అతను అక్కడికి చేరుకున్నాడు. ప్రతిభ, శిశువు ఇంటి మొదటి అంతస్తులో ఉన్నారు. కిషోర్ ప్రతిభ ఉన్న గదిలోకి వెళ్లి లోపలి నుండి తలుపు వేశాడు. కిషోర్ మొదట పురుగుల మందు తాగాడు. అనంతరం ప్రతిభను దుపట్టాతో గొంతు పిసికి చంపేశాడు. వెంకటలక్ష్మమ్మ టెర్రాస్ నుంచి కిందికి దిగి వచ్చి తలుపు కొట్టగా ఎలాంటి స్పందన రాలేదు.

Also Read : ప్రేమ పెళ్లి చేసుకుంటానన్న యువతిని హత్య చేసిన తల్లి, అన్న

ప్రమాదమని భావించిన ఆమె కంటిన్యూగా తలుపుకొట్టారు. కిషోర్ తలుపు తెరవు అంటూ అడగ్గా 15 నిమిషాల తర్వాత అతను తలుపు తెరిచాడు. ‘నేను ప్రతిభను చంపేశాను, నేను ప్రతిభను చంపేశాను’ అని ఆమె తల్లికి చెప్పి అక్కడి నుంచి కిషోర్ వెళ్లి పోయాడు. కిషోర్ ను కఠిన శిక్ష విధించాలని ప్రతిభ తండ్రి సుబ్రమణి కోరారు. అలాగే కిషోర్ తల్లి కూడా ప్రతిభను వరకట్నం కోసం వేధించినట్లు ఆరోపించారు. ప్రతిభ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిషోర్ పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.