Kerala : దూరదర్శన్ లైవ్‌లో గుండెపోటుతో మరణించిన వ్యవసాయ విశ్వ విద్యాలయం డైరెక్టర్
కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్లానింగ్ డైరెక్టర్ డా.అని ఎస్ దాస్ దూరదర్శన్ లైవ్‌లో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.

Kerala
Kerala : కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్లానింగ్ డైరెక్టర్ డా.అని ఎస్ దాస్ దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Gangster Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం…ఢిల్లీ లాయర్ కొనుగోలు
కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ అని ఎస్ దాస్ (59) తరచు కుడప్పనకున్ దూరదర్శన్ కేంద్రంలో లైవ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారం 6.10 గంటలకు ప్రారంభమైన కృషి దర్శన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయన ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలిపోయారు. వెంటనే మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించేసరికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Mumbai Street : ముంబయి వీధిలో మహిళ ప్రసవం…పోలీసులు వచ్చి ఏం చేశారంటే…
అని ఎస్ దాస్ కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ హెడ్‌గా ఉన్నారు. కేరళ ఫీడ్స్, లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ బోర్డ్, పౌల్ట్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు కేరళ మీట్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన పనిచేసారు. ప్రస్తుతం ఎర్నాకులంలోని త్రిపుణితురలో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య డా.విజి ఎర్నాకులం మెడికల్ కాలేజీలో ఫార్మిసీ మెడిసిన్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కాగా వీరికి నిఖిత అనే కుమార్తె ఉన్నారు. దాస్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కడక్కల్‌లో జరగనున్నాయి.