Ayodhya : తిరుపతిలో లడ్డు ప్రసాదం.. మరి అయోధ్యలో ..?

తిరుపతిలో లడ్డూ.. అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం.. వారణాశిలో భోజనం.. ఇలా భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ప్రసాదాలకు ప్రాముఖ్యత ఉంది. అయోధ్య రామ మందిరంలో వితరణ చేయబోతున్న ప్రసాదం ప్రాముఖ్యత మీకు తెలుసా?

Ayodhya :  తిరుపతిలో లడ్డు ప్రసాదం.. మరి అయోధ్యలో ..?

Ayodhya

Updated On : January 3, 2024 / 5:07 PM IST

Ayodhya : భారతదేశంలోని అనేక దేవాలయాల్లో ప్రసాదానికి ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాలు ప్రతిరోజు విచ్చేసే భక్తుల కోసం వందల కిలోల ఆహారాన్ని వడ్డిస్తుంటాయి. అయితే జనవరి 22 న అయోధ్యలో కొలువు తీరనున్న రాముని మందిరంలో ఏ ప్రసాదం అందించబోతున్నారు? చదవండి.

Elachi dana 1

Elachi dana 1

భారత్‌లోని అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రసాదాలు అందుబాటులో ఉంటాయి. వాటికి ఎంతో ప్రత్యేకత కూడా ఉంటుంది. భక్తులు ఎంతో ఇష్టంగా వాటిని స్వీకరిస్తుంటారు. కొనుగోలు చేస్తుంటారు. ఆ పుణ్యక్షేత్రాల నుండి కొనుగోలు చేసి తమవారికి కూడా పంచుతూ ఉంటారు. అలాంటి వాటిలో ముందుగా తిరుపతి లడ్డూకి ఉన్న ప్రత్యేకత గురించి మాట్లాడుకోవాలి. నిజానికి తిరుపతి లడ్డూలకు ఉన్న గొప్పతనం అందరికీ తెలుసు. ఈ పుణ్యక్షేత్రంలో వీటిని తయారు చేయడానికి 1100 మంది పనివారు సౌరశక్తితో నడిచే వంటశాలలో పనిచేస్తుంటారు. ఇక్కడ లడ్డూ ప్రసాదం రుచి మరెక్కడా ఉండదు. అంత ప్రత్యేకంగా తయారు చేస్తారు.

Ayodhya Ram Temple Doors : అయోధ్య రామాలయానికి హైదరాబాద్ తలుపులు, వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా తయారీ

అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామికి నివేదన కోసం చేసే ప్రసాదం కూడా ఎంతో ప్రత్యేకం. గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడితో దానిని తయారు చేస్తారు. ఏడాదిలో కోటి 50 లక్షల ప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేస్తారంటే ఈ ప్రసాదం విశిష్ఠత అలాంటిది. ఇక షిర్డీ సాయినాథుడు వెలసిన పుణ్యక్షేత్రం షిర్డీలో దూద్ పేడా ప్రసాదం ప్రత్యేకం. కృష్ణ దేవాలయాలలో మఖన్ మిశ్రీ, వైష్ణో దేవి డ్రై ఫ్రూట్స్, వారణాసిలోని అన్నపూర్ణ ఆలయంలో భోజనం మరియు గురుద్వారాలో కడ ప్రసాదం వంటివి ప్రసిద్ధ ప్రసాదాలలో కొన్ని. అయితే ఇప్పుడు అయోధ్య రాముని ప్రసాదం ప్రత్యేకత గురించి కూడా చెప్పుకోవాలి.

Elachi Dana 2

Elachi Dana 2

అయోధ్యలో జనవరి 22 న రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ వేడుకలో రాముని విగ్రహం, ఆలయ నిర్మాణం ఇలా ప్రతీదీ ప్రత్యేకమే. ఇక ప్రసాదం గురించి చెప్పాలి. అయోధ్య రాముని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ‘ఇలాచీ దానా’ ప్రసాదంగా ఇవ్వబోతున్నారు. దీనిని చక్కెర, యాలకుల మిశ్రమంతో తయారు చేస్తారు. సాధారణంగా దీనిని దేశంలో అనేక దేవాలయాల్లో ఇస్తుంటారు. రామమందిర ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భక్తుల కోసం దీనిని తయారు చేయడానికి రామ్ విలాస్ అండ్ సన్స్‌కు ఇప్పటికే భారీ ఆర్డర్ ఇచ్చారట. ఈ సంస్థ వీటిని తయారు చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంది. యాలకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉన్నాయి. ముఖ్యంగా కడుపుకి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇలాచీ దానా ప్రసాదంగా ఎంపిక చేసారేమో? ఇకపై దేశ వ్యాప్తంగా ఇలాచీ దానా ప్రసాదం ప్రత్యేకతను సంతరించుకోబోతోంది.