విశ్వాసం అంటే ఇదే : తాచుపాముతో కొట్లాడి కుక్క మృతి

కుక్కలు ఎంతో విశ్వాసం కలిగి ఉంటాయి. కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. వాళ్లు ఊరికనే అనలేదు. అని నిరూపించింది ఓ శునకం. ప్రేమగా చూపే యజమాని పట్ల అవి ఎంతో నిబద్ధతో ఉంటాయి. ఆ ఇంటికి ఎలాంటి హానీ కలుగకుండా చూసుకుంటాయి. అలాంటిదే ఓ కుక్క తన ఓనర్‌ను కాపాడి ప్రాణాలు పొగొట్టుకుంది. ఈ విషాద ఘటన భువనేశ్వర్‌లోని ఖుర్దా జిల్లాలో చోటు చేసుకుంది.
అమన్ షరీఫ్ అనే వ్యక్తి ఏడాదిన్నర వయస్సున్న ‘టైసన్’ అనే డాల్మెషన్ కుక్కను పెంచుకుంటున్నాడు. దీనిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు కూడా. మార్చి 04వ తేదీ సోమవారం రాత్రి టైసన్ అరుపులు వినిపించాయి. దీనితో షరీఫ్ బయటకొచ్చి చూసి షాక్ అయ్యాడు. టైసన్ పడి పోవడం..పక్కనే ఓ తాచు పాము ఉండడం గమనించాడు. వెంటనే కుక్కను హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు.
అయితే పశువుల హాస్పిటల్ మూసి ఉంది. ఫోన్లలో ప్రైవేటు వారిని సంప్రదించాడు. అయినా ఫలితం శూన్యం. చికిత్స సకాలంలో అందలేకపోవడంతో టైసన్ చనిపోయింది. కుక్క ముఖం మీద, తోక మీద పాము కాటు గుర్తులున్నాయి. తాచుపాము లోకి వెళ్లకుండా అడ్డుకున్న టైసన్‌కి కరెక్టు టైంకి వైద్యం అంది ఉంటే తన టైసన్ బతికి ఉండేదని అమన్ కన్నీంటి పర్యంతమయ్యాడు.