Noida : పెళ్లైన 13 రోజులకే భార్యపై దాడి .. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్‌పై గృహ హింస కేసు

మోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రాపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా భార్య యానికాపై గృహ హింసకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.

Noida : పెళ్లైన 13 రోజులకే భార్యపై దాడి .. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్‌పై గృహ హింస కేసు

Noida

Updated On : December 23, 2023 / 1:37 PM IST

Noida : ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రా భార్య యానికాపై గృహ హింసకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. నోయిడాలోని ఆయనపై కేసు నమోదైంది.

Mumbai : చాక్లెట్ బాక్సుల్లో అత్యంత విషపూరితమైన పాములు.. వీటి విషం కోసం అక్రమ తరలింపు

ప్రముఖ మోటివేషనల్ స్పీకర్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన వివేక్ బింద్రా భార్యపై గృహ హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. నోయిడాలోని సెక్టార్ 126 లో ఆయనపై కేసు నమోదైంది. నోయిడాలోని సెక్టార్ 94 లో సూపర్ నోవా వెస్ట్ రెసిడెన్సీలో వివేక్ బింద్రా, భార్య యానికా ఉంటున్నారు. వీరిద్దరికి డిసెంబర్ 6 న వివాహమైంది. కాగా డిసెంబర్ 7 వ తేదీన బింద్రా ఆయన తల్లికి మధ్య తగాదా జరిగింది. ఆ వివాదంలో బింద్రా భార్య యానికా కలగజేసుకోవడం గొడవ మరింత పెరిగింది. చివరికి బింద్రా భార్య యానికాపై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో యానిక శరీరంపై గాయాలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. హాస్పిటల్ బెడ్‌పై యానికా గాయాలతో ఉన్నట్లు వీడియోలో కనిపించింది.

PV Sindhu : ఫోర్బ్స్ జాబితాలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ.. టాప్ 20లో ఏకైక భారతీయురాలు.. ఈ ఏడాది ఆమె సంపాదన ఎంతంటే?

బింద్రా యానికాను గదిలోకి తీసుకెళ్లి అసభ్య పదజాలంలో ధూషించడంతో పాటు జుట్టు లాగి ఆమెపై దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో చెవికి గాయం కావడంతో ఆమెకు సరిగా వినపడటం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బింద్రా యానికా ఫోన్ కూడా పగలగొట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బడా బజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అయిన బింద్రాకు యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్‌లలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇతని కంపెనీ నుండి అనేకమంది విద్యార్ధులు మోసపోయాంటూ కూడా బింద్రాపై ఆరోపణలు ఉన్నాయి. మరో యూట్యూబర్ సందీప్ మహేశ్వరి బింద్రా తీవ్ర ఆరోపణలు చేశారు. శిక్షణ పేరుతో వివేక్ బింద్రా విద్యార్ధుల నుండి భారీ మొత్తంలో డబ్బులు దోపిడి చేస్తున్నారని సందీప్ మహేశ్వరి ఓ వీడియో కూడా విడుదల చేసారు.