Dr Vikas Divyakirti : ఏడవని అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవద్దు .. ఐఏఎస్ అధికారి సూచనలు

ఏడ్చే మగవారిని నమ్మద్దు అంటారు. అవి వెనుకటి రోజులట.. ఏడ్వని మగవారిని పెళ్లే చేసుకోవద్దు అంటున్నారు ఓ ఐఏఎస్ అధికారి. షాకయ్యారా? అలాగని అమ్మాయిలకు సూచిస్తున్నారు. ఎందుకో చదవండి.

Dr Vikas Divyakirti : ఏడవని అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవద్దు .. ఐఏఎస్ అధికారి సూచనలు

Dr Vikas divyakirti

Updated On : September 15, 2023 / 4:27 PM IST

Dr Vikas divyakirti : ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెట్టినింటికి వెళ్లిన కూతురు ఎటువంటి కష్టాలు రాకూడదని భావిస్తారు. అసలు అబ్బాయి ఎలాంటి వాడు తెలుసుకోవాలని చాలా ఎంక్వైరీ చేస్తారు. అయితే పెళ్లిచూపుల్లోనే అబ్బాయి ఎలాంటివాడన్నదీ ఒకే ఒక ప్రశ్నతో అంచనా వేసేయచ్చట. ఈ విషయాన్ని ఓ ఐఏఎస్ అధికారి చెబుతుండటంతో మ్యాటర్ కాస్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరాయన? ఆయన అడగమన్న ప్రశ్న ఏంటి? చదవండి.

Benefits of Tears : కన్నీళ్లు ఆరోగ్యకరమేనా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

ఏడ్చే మగవారిని నమ్మకండి అంటారు. కానీ ఏడవని మగవారిని పెళ్లి చేసుకోవద్దని ఓ ఐఏఎస్ అధికారి అమ్మాయిలకు సూచన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయనే డా.వికాస్ దివ్యకీర్తి. 1996 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. హోంమంత్రిత్వ శాఖలో ఒకే సంవత్సరం పనిచేసి ఆ జాబ్‌కి రిజైన్ చేసేసారు. దృష్టి ఐఏఎస్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. రచయితగా, ఉపాధ్యాయుడిగా ఈయనకు గుర్తింపు ఉంది. ఈయన కేవలం యూపిఎస్సికి సంబంధించిన విషయాలే కాదు జీవితానికి సంబంధించిన అనేక అంశాల గురించి అమ్మాయిలు, అబ్బాయిలకు సలహాలు, సూచనలు చేస్తుంటారు. తాజాగా ఆయన ఎప్పుడూ ఏడవలేదు అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు అని సూచించడం వైరల్‌గా మారింది.

Crying Benefits : ఏడవటానికి సంకోచించొద్దు..ఏడిస్తే ఎన్ని ప్రయోజనాలో

అమ్మాయిలు పెళ్లిచూపుల్లో అబ్బాయిని ఎలాంటి ప్రశ్న వేయాలో డా.వికాస్ దివ్యకీర్తి సూచించారు. ‘మీరు చివరి సారి ఎప్పుడు ఏడ్చారు?’ అని అబ్బాయిని అడగాలట. ఎప్పుడూ ఏడవలేదు.. చిన్నప్పుడు ఎప్పుడో ఏడ్చాను.. నాకు ఏడుపు రాదు.. ఇలాంటి సమాధానాలు చెప్పిన ఏ అబ్బాయి అయినా అతను ఎంత అందగాడైనా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా రిజెక్ట్ చేయాలట. ఎందుకంటే ఏడవని మనస్తత్వం ఉన్నవారు కఠినంగా ఉంటారట. అలాంటివారు ఇతరుల ఎమోషన్స్ కూడా అర్ధం చేసుకోరట. సాధారణంగా భావోద్వేగాలకు గురైనపుడు ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ అనే రసాయనాలు విడుదల అవుతాయి. అవి కన్నీటికి కారణం అవుతాయి. ఏడిస్తే బాధ తగ్గుతుంది. మొత్తానికి డా.వికాస్ దివ్యకీర్తి ఇచ్చిన సూచన అమ్మాయిల్ని కాస్త ఆలోచనలో పడేస్తోంది.