Covid-19: కొవిడ్ కేసులు పెరుగుతున్నాయ్, భయపడొద్దు.. హాస్పిటలైషన్ తక్కువే
ఢిల్లీ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మహారాష్ట్ర తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి.

CM Kejriwal
Covid-19: ఢిల్లీ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మహారాష్ట్ర తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులు పెరుగుతున్న ఢిల్లీలో కరోనా విజృంభణ మరోసారి అధికమైంది.
‘కొవిడ్ కేసులు ఢిల్లీలో వేగవంతంగా పెరుగుతున్నాయి. కంగారుపడాల్సిన పనిలేదు. ప్రస్తుతం సిటీలో 6వేల 360 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ్టికి 3వేల 100కొత్త కేసులు వస్తాయని భావిస్తున్నాం. కేవలం 246మంది హాస్పిటల్ లో చేరారు. ఇప్పటి వరకూ 82ఆక్సిజన్ బెడ్స్ మాత్రమే అవసరమయ్యాయి. ఢిల్లీ గవర్నమెంట్ 37వేల బెడ్స్ ఏర్పాటు చేసింది. కొత్త కేసులన్నింటిలోనూ తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయని చెప్పగలుగుతున్నాం. కంగారుపడొద్దు’ అని కేజ్రీవాల్ ధైర్యం చెబుతున్నారు.
భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం నాటికి ఒమిక్రాన్ కేసులు 1525 చేరాయి. ఇక ఈ వేరియంట్ నుంచి కోలుకొని 560 మంది ఇళ్లకు చేరారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ ,తెలంగాణ, కర్ణాటక, హర్యానా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: చంద్రబాబు చెప్పినట్టు రాధా చేస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి
ఇక ఆయా రాష్ట్రాల్లో నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 460, ఢిల్లీలో 351, గుజరాత్ 136, తమిళనాడులో 117, కేరళలో109, రాజస్థాన్ 69, తెలంగాణ 67,కర్ణాటక 63,హర్యానా 63, పశ్చిమ బెంగాల్ 29, ఏపీ17, ఒడిశా 14, మధ్యప్రదేశ్ 9, ఉత్తరప్రదేశ్ 8, ఉత్తరాఖండ్ 8,చండిఘడ్ 3 జమ్మూకాశ్మీర్ 3, అండమాన్ నికోబార్ 2, గోవా 1, హిమాచల్ ప్రదేశ్ 1, లద్దాఖ్ 1,మణిపూర్ 1,పంజాబ్ 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి.