Children Vaccine : పిల్లలకు టీకా.. తొందరపడటం ఇష్టం లేదన్న కేంద్రమంత్రి

పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు వేయడంలో ప్రభుత్వం తొందరపడకూడదని కేంద్రం ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశాల్లో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్కడా..

Children Vaccine : పిల్లలకు టీకా.. తొందరపడటం ఇష్టం లేదన్న కేంద్రమంత్రి

Children Vaccine

Updated On : November 13, 2021 / 12:02 AM IST

Children Vaccine : పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు వేయడంలో ప్రభుత్వం తొందరపడకూడదని కేంద్రం ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశాల్లో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్కడా పెద్ద ఎత్తున పిల్లలకు టీకాలు వేయడం లేదని ఆయన తెలిపారు. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తొందర పడటం ఇష్టం లేదన్న ఆయన జాగ్రత్తగా నడవాలన్నారు.

ఇప్పటికే పిల్లల కోసం పలు కంపెనీలు టీకాలు తయారు చేసినా అవి ఇంకా మన దేశంలో ఆమోదంలో లేవని మంత్రి గుర్తు చేశారు. జైడస్‌ వ్యాక్సిన్‌ కూడా పిల్లలకు పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదని ఆయన తెలిపారు. దీనిపై సమగ్రంగా చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

iPhone Users: హ్యాకర్లతో ఐఫోన్ యూజర్లను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది-గూగుల్

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అంతం కాదన్న మంత్రి.. ప్రజలు తప్పకుండా కరోనా నింబంధనలు పాటించాలని కోరారు. పిల్లలు కూడా కోవిడ్‌ నింబంధనలు పాటించేలా జాగ్రత్తలు వహించాలన్నారు. మొదటి డోసు టీకా తీసుకున్న వారు తప్పనిసరిగా రెండో డోసు కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు.