క్యూఆర్-శామ్ క్షిపణి ప్రయోగం విజయవంతం

DRDO surface-to-air missile shoots down aerial target in latest test దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) మంగళవారం ప్రయోగించిన క్యూఆర్-సామ్(quick-reaction surface-to-air missile)క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిషాలోని చంఢీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన ఈ మిసైల్ నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
గడిచిన ఐదు రోజుల్లో ఇది రెండవ ‘క్యూఆర్-సామ్’ సిస్టమ్ టెస్ట్. ఈనెల 13నే దీని సామర్థ్యాలను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించినప్పటికీ ఇవాల్టి పరీక్షలో క్షిపణిలోని వార్‌హెడ్ల పనితీరును పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణి 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేస్తుంది. శత్రుదేశ యుద్ధవిమానాల రాడార్ల జామింగ్‌కు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ కౌంటర్ చర్యలతో ఇది పోరాడుతుంది.
క్యూఆర్ సామ్ పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
#WATCH Quick Reaction Surface to Air Missile air defence system successfully testfired by DRDO today. The Missile system secured a direct hit on its target during the trial pic.twitter.com/AKn7J488Wi
— ANI (@ANI) November 17, 2020