Drugs Smuggling : డ్రగ్స్ రవాణాలో కొత్త కోణం.. ఇండియా మీదుగా స్మగ్లింగ్..
డ్రగ్స్ రవాణాలో కొత్త కోణం వెలుగుచూసింది. ఇండియా మీదుగా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను డీఆర్ఐ పట్టుకుంది. ఇండియాను ట్రాన్సిట్ పాయింట్‌గా డ్రగ్స్ మాఫియా ఎంచుకుంది.

Drugs Mafia Busted By Dri While Smuggling Drugs Via India To Australia
Smuggling Drugs Via India to Australia : డ్రగ్స్ రవాణాలో కొత్త కోణం వెలుగుచూసింది. ఇండియా మీదుగా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను డీఆర్ఐ పట్టుకుంది. ఇండియాను ట్రాన్సిట్ పాయింట్‌గా డ్రగ్స్ మాఫియా ఎంచుకుంది. వయా ఇండియా మీదుగా ఇతర దేశాలకు డ్రగ్స్ రవాణా చేస్తోంది. మూడు రోజుల క్రితమే మూడు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో డ్రగ్స్ భారీగా పట్టుబడింది.
డ్రగ్స్ మాఫియా కదలికలపై డీఆర్‌ఐ ఎప్పటికప్పుడూ ఆరా తీస్తోంది. జొహెన్‌బర్గ్ నుంచి దోహా మీదుగా ఇండియాకు డ్రగ్స్ ట్రాన్సిట్ జరుగుతున్నట్టు గుర్తించింది. ఇండియా మీదుగా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోంది మాఫియా.. డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ తీసుకెళ్తే పట్టుబడుతారన్న అనుమానంతో.. ఇండియా మీదుగా స్మగ్లింగ్ చేస్తోంది.
ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల్లో రూ. 400 కోట్ల డ్రగ్స్ ను డీఆర్‌ఐ పట్టుకుంది. ఈ మాఫియా ముఠాలో ఆరుగురు మహిళలను డీఆర్‌ఐ అరెస్ట్ చేసింది. డ్రగ్స్ మాఫియా వెనుకున్న సూత్రదారులెవ్వరు అన్న దానిపై డిఆర్ఐ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తోంది.