Liquor Dry Days: వచ్చే 6 నెలల్లో ఈ తేదీల్లో మద్యం దొరకదు.. ఎందుకో తెలుసా?

వచ్చే ఆరు నెలల్లో కొన్ని రోజులు మద్యం షాపులు బంద్ కానున్నాయి.

Liquor Dry Days: వచ్చే 6 నెలల్లో ఈ తేదీల్లో మద్యం దొరకదు.. ఎందుకో తెలుసా?

Dry Days

Updated On : March 28, 2021 / 4:47 PM IST

Liquor stores : ఏదైనా ఇంపార్ట్ంట్ రోజుల్లో ప్రభుత్వాలు పలు ఆంక్షలు, నిబంధనలు విధిస్తుంటాయి. ప్రధానంగా..లిక్కర్ షాపులు అస్సలు తెరవొద్దు అంటూ ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఎన్నికలు, ప్రధాన ఊరేగింపులు, ఇతరత్రా రోజుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు మద్యం దుకాణాలు, కల్లు, బార్లు షాపులు మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంటారు. దీంతో మద్యం బాబులు నిరుత్సాహానికి గురవుతుంటారు. మరికొందరు ముందుగానే స్టాక్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటుంటారు.

అయితే..కొంతమందికి ఏ రోజుల్లో షాపులు బంద్ కానున్నాయో తెలియదు. దీంతో వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో లిక్కర్ పార్టీ పెట్టుకోవాలని ప్లాన్స్ చేసుకుంటుంటారు. కానీ..ఆ రోజు షాపులు బంద్ ఉన్నాయని తెలుసుకుని నిరుత్సాహానికి గురవుతుంటారు. ఎప్పుడు ? ఈ రోజులో బంద్ కానున్నాయి

తాజాగా..వచ్చే ఆరు నెలల్లో కొన్ని రోజులు మద్యం షాపులు బంద్ కానున్నాయి. కానీ..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. దేశ రాజధాని ఢిల్లీలో. ప్రస్తుతం హోలీ పండుగను ఎంజాయ్ చేసేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. అయితే..హోలీ పండుగను పురస్కరించుకుని..2021, మార్చి 29వ తేదీన మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఎప్పుడు బంద్ కానున్నాయో పూర్తి వివరాలు :-

హోలీ : 2021, మార్చి 29 (సోమవారం)
గుడ్ ఫ్రైడే : 2021, ఏప్రిల్ 02. (శుక్రవారం)
అంబేద్కర్ జయంతి : 2021, ఏప్రిల్ 14 (బుధవారం)
రామనవమి : 2021, ఏప్రిల్ 21 (బుధవారం)
మహవీర్ జయంతి : 2021, ఏప్రిల్ 25 (ఆదివారం)

ఈదుల్ ఫితర్ : 2021, మే 12 (బుధవారం)
Eid ul-Fitr : 2021, మే 13 (గురువారం)
గురు పౌర్ణిమ : 2021, జులై 24 (శనివారం)
మొహర్రం : 2021, ఆగస్టు 10 (మంగళవారం)
ఇండిపెండెన్స్ డే : 2021, ఆగస్టు 15 (ఆదివారం)
వినాయక చవితి : 2021, సెప్టెంబర్ 10 (శుక్రవారం)

Read More : Prince William : ఇతగాడి బట్టతలకు ప్రపంచమే ఫిదా.. సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్‌గా ప్రిన్స్