డచ్ రాజదంపతులకు ఢిల్లీలో ఘనస్వాగతం

  • Published By: venkaiahnaidu ,Published On : October 14, 2019 / 02:28 AM IST
డచ్ రాజదంపతులకు ఢిల్లీలో ఘనస్వాగతం

Updated On : October 14, 2019 / 2:28 AM IST

ఐదు రోజుల భారత పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాజదంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. 2013లో నెదర్లండ్స్ సింహాసనం అధిరోహించిన తరువాత
విలియమ్ అలెగ్జాండర్ భారతదేశానికి మొదటిసారిగా వచ్చారు. 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధాని నరేంద్రమోడీతో నెదర్లాండ్స్ రాజు విలియమ్ అలగ్జాండర్ భేటీ కానున్నారు. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో ఆయనతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగే 25వ టెక్నాలజీ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజదంపతులు పాల్గొంటారు. ఈ సమ్మిట్ లో నెదర్లాండ్స్ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అధికారిక ప్రోగ్రామ్స్ తర్వాత ముంబై,కేరళలో పర్యటించనున్నారు రాజదంపతులు.  ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ సహకారాన్ని పెంచుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 

భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక వాణిజ్య టర్నోవర్ 12.87 బిలియన్ డాలర్లు (2018-2019). 2000 మరియు 2017 మధ్య 23 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నెదర్లాండ్స్ భారతదేశంలో 5 వ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది