అండమాన్ లో భూకంపం

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2019 / 06:23 AM IST
అండమాన్ లో భూకంపం

Updated On : January 17, 2019 / 6:23 AM IST

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. గురువారం(జనవరి 17,2019) ఉదయం 8.43 గంటల సమయంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ(NCS) తెలిపింది. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నస్టంకి సంబంధిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. నికోబార్ ద్వీపాల ప్రాంతంలో బంగాళాఖాతం సముద్రంలో 84కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు.