Earthquake: నేపాల్ కేంద్రంగా భారీ భూకంపం.. భార‌త్‌లోనూ కంపించిన భూమి

నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్ర 7.1 గా నమోదైంది.

Earthquake: నేపాల్ కేంద్రంగా భారీ భూకంపం.. భార‌త్‌లోనూ కంపించిన భూమి

Nepal Earthquake

Updated On : January 7, 2025 / 8:11 AM IST

Earthquake Nepal: నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.1 గా నమోదైంది. మంగళవారం ఉదయం 6.40గంటల ప్రాంతంలో భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. నేపాల్ -టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలోఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ భూకంపం సంభవించింది. టిబెట్ లోని షిజాంగ్ లో 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు తెలిపారు.

Also Read: Canada: జస్టిన్ ట్రూడో రాజీనామా.. కెనడా నూతన ప్రధాని ఎవరు..? ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి దక్కబోతుంది..

భారత దేశంలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఉత్తరాధి రాష్ట్రాలయిన ఢిల్లీ -ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే, భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తుంది. మరోవైపు చైనా, భూటాన్, బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది.