Earthquake : ఈశాన్య రాష్ట్రాలను వణికించిన వరుస భూకంపాలు…ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో భూప్రకంపనలు

ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈశాన్య అస్సాం రాష్ట్రంలో అక్టోబర్ 2వతేదీన రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది....

Earthquake : ఈశాన్య రాష్ట్రాలను వణికించిన వరుస భూకంపాలు…ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో భూప్రకంపనలు

Earthquake

Earthquake : ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈశాన్య అస్సాం రాష్ట్రంలో అక్టోబర్ 2వతేదీన రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారతదేశంలోని గౌహతికి పశ్చిమాన నైరుతి దిశలో 116 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూప్రకంపనలు 10 కిలోమీటర్ల లోతులో సంభవించాయి. ఈశాన్య భారతదేశం, భూటాన్, ఉత్తర బంగ్లాదేశ్ అంతటా భూమి కంపించింది. ఉండవచ్చు.

Also read :  Maharashtra : ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులతో సహా 24 మంది మృతి

ఈ భూకంపం కారణంగా నష్టం లేదా ప్రాణనష్టం గురించి ప్రాథమిక నివేదికలు ఇంకా అందలేదు. అధికారులు సమగ్ర నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. భూకంపం వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రభావిత ప్రాంతంలోని కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడానికి ముందు రహదారి పరిస్థితులను చూడాలని అధికారులు వాహనచోదకులకు సూచించారు.

Also read :  Maharashtra : నిద్రపోతున్న కార్మికులపైకి దూసుకెళ్లిన ట్రక్కు…ఆపై ఏం జరిగిందంటే…

మేఘాలయలో సోమవారం సాయంత్రం 6:15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మేఘాలయలోని ఉత్తర గారో హిల్స్‌లో సోమవారం రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్, అసోంలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఆదివారం హర్యానాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం ఆదివారం రాత్రి 11.26 గంటలకు 2.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం హర్యానాలోని రోహ్‌తక్‌కు తూర్పు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Also read :  BRS : గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్న కృష్ణార్జునులు, మరోసారి కేసీఆర్‌ను సీఎంను చేయడమే లక్ష్యం

ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా భూకంప జోన్‌లో వస్తాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాన్ని తరచుగా భూకంపాలు తాకుతున్నాయి. సెప్టెంబర్‌ నెలలో అసోంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అస్సాంలోని కచార్ జిల్లాలో భూకంప కేంద్రంతో భూ ఉపరితలం కింద 43 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తూ తేలికపాటి భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. రెండు నెలల క్రితం ఆగస్టులో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో మరో తేలికపాటి భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం అసోంలోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు సమీపంలో ఉంది.

Also read :  Nandikanti Sridhar : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్, కీలక నేత రాజీనామా

మయోన్మార్ లోనూ సోమవారం రాత్రి 7.59 గంటలకు భూకంపం సంభవించింది. 120 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదైంది. సెప్టెంబర్ 7 వతేదీన కూడా మయోన్మార్ లో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.