Maharashtra : ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులతో సహా 24 మంది మృతి

ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దారుణ ఉదంతం మహారాష్ట్రలో తాజాగా జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా....

Maharashtra : ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులతో సహా 24 మంది మృతి

Maharashtra government hospital

Maharashtra : ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దారుణ ఉదంతం మహారాష్ట్రలో తాజాగా జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా 24 మంది మరణించారు. మందుల కొరత కారణంగానే మరణాలు సంభవించాయని శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు తెలిపారు. మరణించిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి డీన్ తెలిపారు. మరణించిన 12మంది పెద్దలు పాము కాటుతో సహా వివిధ వ్యాధుల కారణంగా మరణించారని వైద్యులు చెప్పారు.

Also read : Maharashtra : నిద్రపోతున్న కార్మికులపైకి దూసుకెళ్లిన ట్రక్కు…ఆపై ఏం జరిగిందంటే…

80 కిలోమీటర్ల పరిధిలో ఒకే ఆసుపత్రి ఉండటంతో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగి మందుల కొరత ఏర్పడింది. స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసిన తర్వాత రోగులకు మందులు అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ నవజాత శిశువు మరణించాడని శిశువు తండ్రి ఆరోపించారు. ఈ శిశువుల మృతి ఘటన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వికాస్ లవాండే సిగ్గుచేటన్నారు. పిల్లల మృతికి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.

Also read : Nandikanti Sridhar : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్, కీలక నేత రాజీనామా

ప్రచారం కోసం వేలకోట్ల రూపాయలను వెచ్చిస్తున్న బీజేపీ సర్కారు పిల్లలకు మందులు అందించలేక పోయిందని రాహుల్ గాంధీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. సంబంధిత ఆరోగ్యశాఖ మంత్రులను వారి పదవుల నుంచితొలగించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోరారు. ఆసుపత్రిలో ప్రభుత్వ హత్యలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు.