Gujarat : సూరత్‌‌తో పాటు పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..హడలిపోయిన ప్రజలు

గుజరాత్ లోని సూరత్ లో భూమి కంపించింది. సూరత్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవిస్తాయని ముందుగా అంచనా వేసి తెలిజేసిన నెదర్లాండ్స్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ భారత్ ఉపఖండంలో కూడా భూకంపాలు సంభవిస్తాయని చెప్పటం ఆందోళన కలిగిస్తోంది.

Gujarat : సూరత్‌‌తో పాటు పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..హడలిపోయిన ప్రజలు

gujarat earthquake

Updated On : February 11, 2023 / 4:25 PM IST

Gujarat : కొన్ని రోజుల క్రితం టర్కీ, సిరియా దేశాలను భారీ భూకంపాలు కుదిపేసిన క్రమంలో భూకంపం అంటేనే హడలిపోతున్నారు ప్రజలు. టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవిస్తాయని ముందుగా అంచనా వేసి తెలిజేసిన నెదర్లాండ్స్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ భారత్ ఉపఖండంలో కూడా భూకంపాలు సంభవిస్తాయని చెప్పటం ఆందోళన కలిగిస్తోంది.  ఈ క్రమంలో గుజరాత్ లోని సూరత్ లో భూమి కంపించింది. సూరత్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. టర్కీ, సిరియా భూకంప విషాదలు కొనసాగుతుండగా గుజరాత్ తో భూమి కంపించటంతో జనాలు హడలిపోయారు. అర్థరాత్రి భూప్రకంపనలు రావటంతో నిద్రలో ఒక్కసారిగి ఉలిక్కిపడ్డ జనాలకు కాసేపు ఏం జరిగిందో కూడా అర్థంకాలేదు.అయోమయానికి గురి అయ్యారు. కాసేపటికి అవి భూ ప్రకంపనలుగా భావించి ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఎందుకంటే గుజరాత్ తో భూకంపాలు చాలానే సంభవించాయి.

Earthquake: టర్కీ, సిరియాలో సంభవించినట్లే భారత్, పాక్ లోనూ భారీ భూకంపాలు వస్తాయా?

ముఖ్యంగా గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో 2001లో సంభవించిన భూకంపంలో దాదాపు 14,000మంది ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో శుక్రవారం (ఫిబ్రవరి 10,2023)గత అర్ధరాత్రి తర్వాత సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అర్థరాత్రే ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కానీ ఎవ్వరిని ఎటువంటి ప్రమాదం జరగలేదు. గాయాలుకూడా కాలేదు.ఇక ఎటువంటి ఆస్తినష్టం కూడా జరుగలేదు. ఈ భూకంప కేంద్రం సూరత్ కు నైరుతి దిశగా 27 కీలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

Turkey-Syria Earthquake: పసిగుడ్డు ఏడుపు.. 90 గంటల తరువాత శిథిలాల్లోంచి 10రోజుల పసిబిడ్డతో బతికి బటయపడ్డ తల్లి

కాగా గుజరాత్ తరచు భూకంపాలను ఎదుర్కొంటోంది. గుజరాత్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజమ్ మెంట్ అథారిటీ (SDMA0 వివరాల ప్రకారం..1819,1845,1847,1848,1864,1903,1938,1956,2001లలో భూకంపాలు సంభవించాయి.కానీ కచ్ ప్రాంతంలో 2001లో సంభవించిన భారీ భూకంపంలో దాదాపు 14,000మంది ప్రాణాలు కోల్పోగా..1.67 లక్షల మంది గాయపడ్డారు. గత రెండు శతాబ్దాల్లో ఇది ప్రపంచంలోనే అతిభారీ భూకంపాల్లో మూడవది కాగా, భారత్ లో అత్యంత విధ్వంసం సృష్టించిన భూకంపాల్లో రెండోదిగా రికార్డు అయ్యింది.

Syria earthquake : సిరియా భూకంప శిథిల్లాల్లోనే ప్రసవం .. బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మహిళ

Turkey,Syria Earthquake : భూకంప శిథిల్లాల్లో పుట్టిన పసిబిడ్డకు ‘అయా’అని పేరు పెట్టిన డాక్టర్..‘అయా’అంటే అర్థం ఎంత ‘అద్భుతం’గా ఉందో..!!