లోక్ సభ రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
ఏప్రిల్ 18న జరుగనున్న లోక్ సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ మార్చి 19 మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏప్రిల్ 18న జరుగనున్న లోక్ సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ మార్చి 19 మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఢిల్లీ : ఏప్రిల్ 18న జరుగనున్న లోక్ సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ మార్చి 19 మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నోటిఫికేషన్ జారీతోనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మార్చి 26 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. మార్చి 27న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 29వ తేదీలోగా వాటిని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులు నిలిచారన్నది ఆ రోజు సాయంత్రానికి తేలిపోనుంది.
తమిళనాడులోని 39 స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానం, ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది, బిహార్‌లోని ఐదు, పశ్చిమ బెంగాల్‌లోని మూడు, జమ్ము-కశ్మీర్‌లోని రెండు (శ్రీనగర్, ఉధంపూర్) స్థానాలకు కూడా ఈ విడతలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి.