Panauti Remark: మరోసారి మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అంతే స్థాయిలో స్పందించింది. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Panauti Remark: మరోసారి మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు

Updated On : November 23, 2023 / 5:06 PM IST

మోదీ దురదృష్టం వల్లే ఇండియా ఓడిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రమం వ్యక్తం చేసింది. ఈ విషయమై రాహుల్ గాంధీకి నోలీసులు పంపిన ఈసీ.. నవంబర్ 25లోగా సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మోదీని పనౌతి (చెడు శకునం), పిక్ పాకెట్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి రాహుల్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తాయి.


ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత జట్టు ఓడిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఫైనల్ మ్యాచుకు ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. అయితే మ్యాచ్‌ను వీక్షించేందుకు మోదీ స్టేడియానికి రావడం వల్లే జట్టు ఓటమి పాలైందంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. ఇండియా దాదాపు ప్రపంచకప్‌ను గెలుచుకుందని, కాకపోతే ఓ చెడు శకనం వారిని ఓడిపోయేలా చేసిందని మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీవీల్లో ఈ విషయం చూపించరని, కానీ దేశ ప్రజలకు అది తెలుసని అన్నారు. అయితే తన వ్యాఖ్యల్లో ఎక్కడా నరేంద్రమోదీ పేరును రాహుల్ ఎత్తకుండా నేరుగానే విమర్శలు చేశారు.


రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన జట్టు గెలిచేదేనని, అయితే ఓ చెడు శకనం మ్యాచ్‌కు రావడం వల్ల మనోళ్లు ఓడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అంతే స్థాయిలో స్పందించింది. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ మానసిక అస్థిరతకు ఆయన మాటలు అద్దంపడుతున్నాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు.