EC Notices Mamata : మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దీదీ కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసింది.

EC notices to CM Mamata Banerjee
EC notices issued to CM Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దీదీ కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసింది. హుగ్లీ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మమతా బెనర్జీ… అమిత్ షా సూచనల మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పనిచేస్తోందని మమతా ఆరోపించారు.
దీంతో రెచ్చగొట్టే ప్రసంగాలు, కేంద్ర బలగాలను కించపర్చినందుకు నోటీసులు జారీ చేశామని ఈసీ పేర్కొంది. రేపటిలోగా వీటిపై వివరణ ఇవ్వాలంది. ఇప్పటికే ఒకసారి ఈసీ మమతా బెనర్జీకి నోటీసులు జారీ చేసింది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు, దీదీ పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శులు చేసుకుంటున్నారు. మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని మమతా, ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. జోరుగా ప్రచారం చేశారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు.
Read Here>>>Mamata Bannerjee : దీదీ కాలినొప్పి తగ్గిపోయిందా ? వీడియో వైరల్